నీ వేమి గడించుకొన్నా నీ చిత్తమయ్య
(॥పల్లవి॥)
నీ వేమి గడించుకొన్నా నీ చిత్తమయ్య
వేవేలకు మా చెరఁగు విడువవయ్యా
(॥నీవే॥)
సిగ్గుపడి నేనుండితే చిన్నఁ బోయితి ననేవు
వెగ్గళించ నీ మాటకు వెఱతుమయ్యా
అగ్గమై నిద్దిరించితే నలసితి నేననేవు
యెగ్గులుఁ దప్పులింతేసి యెఱఁగమయ్యా
(॥నీవే॥)
గుట్టున నే నూరకున్నఁ గోపగించితి ననేవు
వట్టి దూరులు మాకింత వలదయ్యా
కట్టఁగడ నిలుచుంటే కపటమే నెననేవు
యెట్టును బోనీవు చలమేఁటికయ్యా
(॥నీవే॥)
నెచ్చెలుల నేఁ దిట్టితే నీ పైకిఁ దీసుకొనేవు
చెచ్చెర మమ్మింత ఱట్టు సేయకుమయ్యా
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
ముచ్చటలన్నియుఁ దేరె మొక్కేమయ్యా
(||pallavi||)
nī vemi gaḍiṁchugŏnnā nī sittamayya
vevelagu mā sĕram̐gu viḍuvavayyā
(||nīve||)
siggubaḍi nenuṁḍide sinnam̐ boyidi nanevu
vĕggaḽiṁcha nī māḍagu vĕṟadumayyā
aggamai niddiriṁchide nalasidi nenanevu
yĕggulum̐ dappuliṁtesi yĕṟam̐gamayyā
(||nīve||)
guṭṭuna ne nūragunnam̐ gobagiṁchidi nanevu
vaṭṭi dūrulu māgiṁta valadayyā
kaṭṭam̐gaḍa nilusuṁṭe kabaḍame nĕnanevu
yĕṭṭunu bonīvu salamem̐ṭigayyā
(||nīve||)
nĕchchĕlula nem̐ diṭṭide nī paigim̐ dīsugŏnevu
sĕchchĕra mammiṁta ṟaṭṭu seyagumayyā
yichchagum̐ḍa śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
muchchaḍalanniyum̐ derĕ mŏkkemayyā