Nee vemdarigi nauduvu nee paabamu

నీ వెందరికి నౌదువు నీ పాపము
Language

(॥పల్లవి॥)
నీ వెందరికి నౌదువు నీ పాపము
వావులఁ గూడవేయఁగా వాములాయ వలపు

(॥నీ వెం॥)
వంతులకు నొకమాట వాసులకు నొకమాట
కొంతగొంత గొసరేరు కొమ్మలు నిన్ను
బంతివిందులు చెప్పేరు పాలిండ్లు చూపి చూపి
సంతకూటములలోని చవులాయ వలపు

(॥నీ వెం॥)
కలువల నొకవాటు కప్పురాన నొకవాటు
చలములు సాదించేరు సతులు నిన్ను
వెలలు నీకుఁ బెట్టేరు వేడుకల మోవులకు
కలగూరగంపలె గరుబాయ వలపు

(॥నీ వెం॥)
కాతరాలన నొకరతి కాఁకలనే వొకరతి
పైతరవు వెట్టేరు భామలు నిన్ను
నీతితో శ్రీవేంకటేశ నీవు మమ్మిట్టె కూడగ
రేతిరిఁ బగలు పెరరేఁపులాయ వలపు

(||pallavi||)
nī vĕṁdarigi nauduvu nī pābamu
vāvulam̐ gūḍaveyam̐gā vāmulāya valabu

(||nī vĕṁ||)
vaṁtulagu nŏgamāḍa vāsulagu nŏgamāḍa
kŏṁtagŏṁta gŏsareru kŏmmalu ninnu
baṁtiviṁdulu sĕpperu pāliṁḍlu sūbi sūbi
saṁtagūḍamulaloni savulāya valabu

(||nī vĕṁ||)
kaluvala nŏgavāḍu kappurāna nŏgavāḍu
salamulu sādiṁcheru sadulu ninnu
vĕlalu nīgum̐ bĕṭṭeru veḍugala movulagu
kalagūragaṁpalĕ garubāya valabu

(||nī vĕṁ||)
kādarālana nŏgaradi kām̐kalane vŏgaradi
paidaravu vĕṭṭeru bhāmalu ninnu
nīdido śhrīveṁkaḍeśha nīvu mammiṭṭĕ kūḍaga
redirim̐ bagalu pĕrarem̐pulāya valabu