నీ వేల వాదడిచేవు నే మెరఁగమా
(॥పల్లవి॥)
నీ వేల వాదడిచేవు నే మెరఁగమా
లోవెలుతులు మా చేతిలోనివే కావా
(॥నీవే॥)
ఆగడీఁడ వని నేనిన్నపుడు దూరినందుకు
వేగిరపడేవు నీవు వింత వాఁడవా
చేగమీరినకోపము చెలులకుఁ జెల్లుఁగాక
భోగములో బిగువులు పురుషుల కేఁటికి
(॥నీవే॥)
అడియాలా లెల్లాఁ జూచి అట్టె నేఁ దిట్టినందుకు
కడునెగ్గులు వట్టెవు కడవాఁడవా
విడువక వెంగే లాడ వెలఁదుల కగుఁ గాక
వడితోఁ బంతాలు మగవారి కేఁటికి
(॥నీవే॥)
నయ మిచ్చి నే నీతో నవ్వులు నవ్వినందుకు
ప్రియాలు చెప్పి వదేమి పిన్న వాఁడవా
దయతో శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
నియమాలు మాకే కాక నీకేఁటికి
(||pallavi||)
nī vela vādaḍisevu ne mĕram̐gamā
lovĕludulu mā sedilonive kāvā
(||nīve||)
āgaḍīm̐ḍa vani neninnabuḍu dūrinaṁdugu
vegirabaḍevu nīvu viṁta vām̐ḍavā
segamīrinagobamu sĕlulagum̐ jĕllum̐gāga
bhogamulo biguvulu puruṣhula kem̐ṭigi
(||nīve||)
aḍiyālā lĕllām̐ jūsi aṭṭĕ nem̐ diṭṭinaṁdugu
kaḍunĕggulu vaṭṭĕvu kaḍavām̐ḍavā
viḍuvaga vĕṁge lāḍa vĕlam̐dula kagum̐ gāga
vaḍidom̐ baṁtālu magavāri kem̐ṭigi
(||nīve||)
naya michchi ne nīdo navvulu navvinaṁdugu
priyālu sĕppi vademi pinna vām̐ḍavā
dayado śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
niyamālu māge kāga nīgem̐ṭigi