నీ వేల సిగ్గువడేవే నెలఁతా
(॥పల్లవి॥)
నీ వేల సిగ్గువడేవే నెలఁతా
యీవలఁ జెలికత్తెల మెగసక్కె మాడేమా
(॥॥)
చుక్కలవలె నీమోవి సూదివాటు లుండఁ గాను
యిక్కున నీకెంగేల నేల మూసేవే
తక్కుక గజరుఁజేఁతలవాఁ డు నీ మగడు
యెక్కడా లేనిదా యందుకేమాయనే
(॥॥)
నాటుకోని చెక్కుల పై నవచంద్రకళ లుండఁ గాను
గాటవుఁ గస్తూ రెంతకడు మెత్తేవే
మేటియైన నీ విభుఁడు మిక్కిలి నారజకాఁడు
ఆఁటదానికిఁ గలదే యందుకేమాయనే
(॥॥)
తగ నీమెయి నాడాడ తమ్మచదురు లుండఁగ
పొగరుఁగుంకుమలేల పూసుకొనేవే
జగములో శ్రీ వేంకటేశ్వరుఁడె జాజరకాఁడు
అగపడి నిన్ను నేలె నందుకు నేమాయనే
(||pallavi||)
nī vela sigguvaḍeve nĕlam̐tā
yīvalam̐ jĕligattĕla mĕgasakkĕ māḍemā
(||||)
sukkalavalĕ nīmovi sūdivāḍu luṁḍam̐ gānu
yikkuna nīgĕṁgela nela mūseve
takkuga gajarum̐jem̐talavām̐ ḍu nī magaḍu
yĕkkaḍā lenidā yaṁdugemāyane
(||||)
nāḍugoni sĕkkula pai navasaṁdragaḽa luṁḍam̐ gānu
gāḍavum̐ gastū rĕṁtagaḍu mĕtteve
meḍiyaina nī vibhum̐ḍu mikkili nārajagām̐ḍu
ām̐ṭadānigim̐ galade yaṁdugemāyane
(||||)
taga nīmĕyi nāḍāḍa tammasaduru luṁḍam̐ga
pŏgarum̐guṁkumalela pūsugŏneve
jagamulo śhrī veṁkaḍeśhvarum̐ḍĕ jājaragām̐ḍu
agabaḍi ninnu nelĕ naṁdugu nemāyane