నీ వేల పంతాలాడేవు నేఁడు మాతోను
(॥పల్లవి॥)
నీ వేల పంతాలాడేవు నేఁడు మాతోను
భావించితే నాఁడువారి పగటులివి
(॥నీవే॥)
చెక్కులఁ జేతులిడుక సిగ్గులతో నుండేది
చక్కనిసతులకెల్ల సహజమిది
జక్కవ చనుల మీఁద సారె బయ్యెద మూసేది
యెక్కడా మానినులకు యిక్కువలివి
(॥నీవే॥)
వుదుటున నవ్వుతాను వోరచూపులు చూచేవి
చదురాఁడులైనవారి సహజమిది
పొదిగి సన్నలు చేసి బొమ్మల జంకించేది
మొదలఁ గాంతలకును మురిపేలివి
(॥నీవే॥)
పలుకుల లోపలను వచ్చి దొరల నాడేది
అలమేల్మంగనైన నాకందము లివి
చెలఁగి కూడితి విట్టే శ్రీవేంకటేశ నన్ను
వలపు వనితలకు వాడికలివి
(||pallavi||)
nī vela paṁtālāḍevu nem̐ḍu mādonu
bhāviṁchide nām̐ḍuvāri pagaḍulivi
(||nīve||)
sĕkkulam̐ jeduliḍuga siggulado nuṁḍedi
sakkanisadulagĕlla sahajamidi
jakkava sanula mīm̐da sārĕ bayyĕda mūsedi
yĕkkaḍā māninulagu yikkuvalivi
(||nīve||)
vuduḍuna navvudānu vorasūbulu sūsevi
sadurām̐ḍulainavāri sahajamidi
pŏdigi sannalu sesi bŏmmala jaṁkiṁchedi
mŏdalam̐ gāṁtalagunu muribelivi
(||nīve||)
palugula lobalanu vachchi dŏrala nāḍedi
alamelmaṁganaina nāgaṁdamu livi
sĕlam̐gi kūḍidi viṭṭe śhrīveṁkaḍeśha nannu
valabu vanidalagu vāḍigalivi