నీ వేల దాచేఁవు నాకు నే నెఱుఁగనా
(॥పల్లవి॥)
నీ వేల దాచేఁవు నాకు నే నెఱుఁగనా
ఆవేళనే వేగువెట్టు కండనే ఉన్నదానను
(॥నీవేల॥)
వేగి లేచి నిన్నుఁ జూచి వీడెము చేతి కిచ్చి
చేగలై రాత్రి రతి చెప్పి చెప్పి నవ్వి
సోగకన్నుల నిద్దుర చోఁపె నిను నాపి లేపి
ఆగడాలు సేసే యప్పు డండనే ఉన్నదానను
(॥నీవేల॥)
చేతఁ దట్టి నిన్ను లేపి చెమట లెల్లాఁ దుడిచి
ఘాతల నీ మర్మములు కడుఁ దడవి
కాతరాన నిన్ను నాపె కౌఁగిలించుకొన్నపుడు
ఆతలి కంబమే మాటు అండనే వున్నదానను
(॥నీవేల॥)
దండె మీటి పాట వాడి తరుణి నిన్ను లేపి
నిండుఁగూరిముల నాపె నిన్నుఁ గూడెను
అండనే శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
అండుకొని యిప్పు డూని యండనే వున్నదానను
(||pallavi||)
nī vela dāsem̐vu nāgu ne nĕṟum̐ganā
āveḽane veguvĕṭṭu kaṁḍane unnadānanu
(||nīvela||)
vegi lesi ninnum̐ jūsi vīḍĕmu sedi kichchi
segalai rātri radi sĕppi sĕppi navvi
sogagannula niddura som̐pĕ ninu nābi lebi
āgaḍālu sese yappu ḍaṁḍane unnadānanu
(||nīvela||)
sedam̐ daṭṭi ninnu lebi sĕmaḍa lĕllām̐ duḍisi
ghādala nī marmamulu kaḍum̐ daḍavi
kādarāna ninnu nābĕ kaum̐giliṁchugŏnnabuḍu
ādali kaṁbame māḍu aṁḍane vunnadānanu
(||nīvela||)
daṁḍĕ mīḍi pāḍa vāḍi taruṇi ninnu lebi
niṁḍum̐gūrimula nābĕ ninnum̐ gūḍĕnu
aṁḍane śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
aṁḍugŏni yippu ḍūni yaṁḍane vunnadānanu