నీ వెక్కుడో ఆపె నీకంటె నెక్కుడో
(॥పల్లవి॥)
నీ వెక్కుడో ఆపె నీకంటె నెక్కుడో
రావయ్య తిరుపతి రఘురామచంద్ర
(॥నీవె॥)
తుమురుగ దనుజులఁ దోలి తొప్పర లాడి
అమరఁగ గెలిచితి నందుపు
మమతతోడుత నిన్ను మదనయుద్ధమునందు
రమణి నిన్ను గెలిచె రఘరామచంద్ర
(॥నీవె॥)
తవిలి శివుఁడు కాశి దారకబహ్మ మని
యివల నిన్నుపదేశ మియ్యగా
నవ మై శ్రీవెంకటనాథ మరుతంత్రము
రవళి నీ కీపె యిచ్చె రఘరామచంద్రా.
(||pallavi||)
nī vĕkkuḍo ābĕ nīgaṁṭĕ nĕkkuḍo
rāvayya tirubadi raghurāmasaṁdra
(||nīvĕ||)
tumuruga danujulam̐ doli tŏppara lāḍi
amaram̐ga gĕlisidi naṁdubu
mamadadoḍuda ninnu madanayuddhamunaṁdu
ramaṇi ninnu gĕlisĕ ragharāmasaṁdra
(||nīvĕ||)
tavili śhivum̐ḍu kāśhi dāragabahma mani
yivala ninnubadeśha miyyagā
nava mai śhrīvĕṁkaḍanātha marudaṁtramu
ravaḽi nī kībĕ yichchĕ ragharāmasaṁdrā.