(॥పల్లవి॥)
నీ వెటువలె మన్నించేవో
భావము నిలువదు పంతానకైనా
(॥నీవె॥)
అలనీతో విరహాన నలసి మరి
కొలుపదు చి త్తము కొంతైనా
తలఁచి తలఁచి నిన్నుఁ దప్పక చూచిన
నిలువదు కన్నీరు నిమిషంబయినా
(॥నీవె॥)
కయ్యపు కాఁకలఁ గాఁగి నవ్వులకు
యియ్యకొనదు తను వేమైనా
కొయ్యమాఁటలను గొణఁగిననాలిక
నెయ్యము వలుకదు నిజానకైనా
(॥నీవె॥)
మహి నీకాఁగిలి మరిగిన చేతులు
సహజము విడువవు సటకైనా
యిహమున శ్రీవేంకటేశ కూడితివి
మహిమలు వొగడెద మాఁటలనైనా
(||pallavi||)
nī vĕḍuvalĕ manniṁchevo
bhāvamu niluvadu paṁtānagainā
(||nīvĕ||)
alanīdo virahāna nalasi mari
kŏlubadu si ttamu kŏṁtainā
talam̐si talam̐si ninnum̐ dappaga sūsina
niluvadu kannīru nimiṣhaṁbayinā
(||nīvĕ||)
kayyabu kām̐kalam̐ gām̐gi navvulagu
yiyyagŏnadu tanu vemainā
kŏyyamām̐ṭalanu gŏṇam̐ginanāliga
nĕyyamu valugadu nijānagainā
(||nīvĕ||)
mahi nīgām̐gili marigina sedulu
sahajamu viḍuvavu saḍagainā
yihamuna śhrīveṁkaḍeśha kūḍidivi
mahimalu vŏgaḍĕda mām̐ṭalanainā