నీ వేడుక చెల్లించేదే నేరుపు నాకు
(॥పల్లవి॥)
నీ వేడుక చెల్లించేదే నేరుపు నాకు
భావించుకొనలేక పదరేవు గనక
(॥నీవే॥)
హత్తి నీతో నవ్వఁ జుమీ ఆపె వద్ద నుండఁగాను
చిత్తములోపలను కొంచేవు గనక
పొత్తుల నారగించఁగా పొంచి తొంగిచూడఁ జుమీ
మత్తిలి సిబ్బితితోడ మానేవు గనక
(॥నీవే॥)
కొంగువట్టి తియ్యఁ జుమీకొమ్మతో మాటాడఁగాను
చెంగట నీవటు చింతించేవు గనక
పొంగి విడే లందుకోగా పోరచి యడుగఁ జుమీ
సంగ తెఱఁగక నీవు జారేవు గనక
(॥నీవే॥)
చెక్కు నొక్కఁజుమ్మీ నిన్ను చెలిమోవి యానగాను
చిక్కి చిన్నఁబోయి యలసేవు గనక
ఇక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
కక్కసించఁజుమ్మీ యాపెఁ గాదనేవు గనక
(||pallavi||)
nī veḍuga sĕlliṁchede nerubu nāgu
bhāviṁchugŏnalega padarevu ganaga
(||nīve||)
hatti nīdo navvam̐ jumī ābĕ vadda nuṁḍam̐gānu
sittamulobalanu kŏṁchevu ganaga
pŏttula nāragiṁcham̐gā pŏṁchi tŏṁgisūḍam̐ jumī
mattili sibbididoḍa mānevu ganaga
(||nīve||)
kŏṁguvaṭṭi tiyyam̐ jumīgŏmmado māḍāḍam̐gānu
sĕṁgaḍa nīvaḍu siṁtiṁchevu ganaga
pŏṁgi viḍe laṁdugogā porasi yaḍugam̐ jumī
saṁga tĕṟam̐gaga nīvu jārevu ganaga
(||nīve||)
sĕkku nŏkkam̐jummī ninnu sĕlimovi yānagānu
sikki sinnam̐boyi yalasevu ganaga
ikkaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
kakkasiṁcham̐jummī yābĕm̐ gādanevu ganaga