Nee veda ne neda nemdu siggu vadam gaaga

నీ వేడ నే నేడ నేఁడు సిగ్గు వడఁ గాక
Language

(॥పల్లవి॥)
నీ వేడ నే నేడ నేఁడు సిగ్గు వడఁ గాక
భావించి నీ కొంగువట్టే బలువు నా కున్నదా

(॥నీవేడ॥)
నిగిడి పదారువేలు నెలఁతలు గల నీకు
జగతి నింకా సతులు సర కయ్యేరా
వగలతో నెరఁగక వలచినదాన నై
జిగి నా మగండ వంటాఁ జెప్పకోనేఁగాక

(॥నీవేడ॥)
తొరలి సీత నడవిఁ దోసి రప్పించిననీకు
తరుణులమీఁదఁ గొంత దయ వున్నదా
గరిమి నీ భ్రమఁ బడి గతి లేనిదాన నై
పరులు చూడఁగ నీ పాద మొత్తేఁ గాక

(॥నీవేడ॥)
తొడపై శ్రీసతిఁ బెట్టి దొడ్డకొలు వున్ననీకు
తడవి నాపొందు లింకాఁ దల పయ్యీనా
యెడయక శ్రీవెంకటేశ కూడినదాననై
బడి వాయక నీవొద్ద బతికితిఁ గాక

(||pallavi||)
nī veḍa ne neḍa nem̐ḍu siggu vaḍam̐ gāga
bhāviṁchi nī kŏṁguvaṭṭe baluvu nā kunnadā

(||nīveḍa||)
nigiḍi padāruvelu nĕlam̐talu gala nīgu
jagadi niṁkā sadulu sara kayyerā
vagalado nĕram̐gaga valasinadāna nai
jigi nā magaṁḍa vaṁṭām̐ jĕppagonem̐gāga

(||nīveḍa||)
tŏrali sīda naḍavim̐ dosi rappiṁchinanīgu
taruṇulamīm̐dam̐ gŏṁta daya vunnadā
garimi nī bhramam̐ baḍi gadi lenidāna nai
parulu sūḍam̐ga nī pāda mŏttem̐ gāga

(||nīveḍa||)
tŏḍabai śhrīsadim̐ bĕṭṭi dŏḍḍagŏlu vunnanīgu
taḍavi nābŏṁdu liṁkām̐ dala payyīnā
yĕḍayaga śhrīvĕṁkaḍeśha kūḍinadānanai
baḍi vāyaga nīvŏdda badigidim̐ gāga