Nee vebaadi mannimchinaa nemdu naagum badivelu

నీ వేపాటి మన్నించినా నేఁడు నాకుఁ బదివేలు
Language

(॥పల్లవి॥)
నీ వేపాటి మన్నించినా నేఁడు నాకుఁ బదివేలు
చేవ దేర మోహించితి చింత లేల నాకు

(॥॥)
చిలుకుఁ జూపుల నిన్నుఁ జిమ్మి చిమ్మి చూడఁగ
చలమరి దాననా సరిదాననా
అలపులా సొలపులా ఆసలఁ బెట్టే నంటే
సలిగెలు నెరుపేనా చవులు చూపేనా

(॥॥)
చాయలకు మాటలాడి సరసము పచరించ
మాయదారి దాననా మంకుదాననా
పాయపు మదాన నీతో పంతము సాదించే నంటే
నాయిచ్చల మెఱసేనా నటన సేసేనా

(॥॥)
కఱకఱిఁ బెట్టి నిన్ను కౌఁగిట బిగించే నంటే
మెఱ మెచ్చుదాననా మేనదాననా
యెఱిఁగితి శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
మఱుఁగులు పెట్టే నా మరి కొసరేనా

(||pallavi||)
nī vebāḍi manniṁchinā nem̐ḍu nāgum̐ badivelu
seva dera mohiṁchidi siṁta lela nāgu

(||||)
silugum̐ jūbula ninnum̐ jimmi simmi sūḍam̐ga
salamari dānanā saridānanā
alabulā sŏlabulā āsalam̐ bĕṭṭe naṁṭe
saligĕlu nĕrubenā savulu sūbenā

(||||)
sāyalagu māḍalāḍi sarasamu pasariṁcha
māyadāri dānanā maṁkudānanā
pāyabu madāna nīdo paṁtamu sādiṁche naṁṭe
nāyichchala mĕṟasenā naḍana sesenā

(||||)
kaṟagaṟim̐ bĕṭṭi ninnu kaum̐giḍa bigiṁche naṁṭe
mĕṟa mĕchchudānanā menadānanā
yĕṟim̐gidi śhrī veṁkaḍeśha nannu nelidivi
maṟum̐gulu pĕṭṭe nā mari kŏsarenā