నీ వన్నిటా జాణవు నీకుఁ జెప్పేమా బుద్ది
(॥పల్లవి॥)
నీ వన్నిటా జాణవు నీకుఁ జెప్పేమా బుద్ది
సేవసే శాపెను మెచ్చఁజేతువుగాక
(॥నీవ॥)
దొరపాటి వనితలు దూరుదురా పతులను
తొరలుచుఁ గొనియాడుదురుగాక
మరిగినచోటను మరి యెగ్గువట్టుదురా
వొరసి గొరగీరినా నోరుతురుగాక
(॥నీవ॥)
వుత్తమనాయికైనది వుదుటున జంకించునా
చిత్తమురా వినయమే సేసుఁగాక
హత్తినట్టిపొందులకు నడ్డమాఁక లున్నవా
బత్తి మీఁదమీఁద రేఁచి బలియించుఁగాక
(॥నీవ॥)
పట్టపుదేవులు మరి పంతాలు నెరపునా
చుట్టమై ఇచ్చకములే చూపుఁగాక
యిట్టె శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్ను నేలె
వొట్టినసంతోసాన నుందువుగాక
(||pallavi||)
nī vanniḍā jāṇavu nīgum̐ jĕppemā buddi
sevase śhābĕnu mĕchcham̐jeduvugāga
(||nīva||)
dŏrabāḍi vanidalu dūrudurā padulanu
tŏralusum̐ gŏniyāḍudurugāga
mariginasoḍanu mari yĕgguvaṭṭudurā
vŏrasi gŏragīrinā norudurugāga
(||nīva||)
vuttamanāyigainadi vuduḍuna jaṁkiṁchunā
sittamurā vinayame sesum̐gāga
hattinaṭṭibŏṁdulagu naḍḍamām̐ka lunnavā
batti mīm̐damīm̐da rem̐si baliyiṁchum̐gāga
(||nīva||)
paṭṭabudevulu mari paṁtālu nĕrabunā
suṭṭamai ichchagamule sūbum̐gāga
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnu nelĕ
vŏṭṭinasaṁtosāna nuṁduvugāga