నీ వల్లనే యీ చేఁతలు నెట్టన బాయిటఁ బడె
(॥పల్లవి॥)
నీ వల్లనే యీ చేఁతలు నెట్టన బాయిటఁ బడె
కావరించఁ జుమ్మీ ఇచ్చకము సేసితిఁగాని
(॥నీవ॥)
పవ్వళించి వుండఁగాను పక్కనఁ దెరవేసితే
నవ్వు లేమి నవ్వేవు నాతో నీవు
యెవ్వతెకుఁ గాచుకుండే దెరఁగఁ జుమ్మీ నేను
చివ్వన నుపచారము సేసితిగాని
(॥నీవ॥)
వేళతో వేగించఁగాను విడేలు వద్దఁ బెట్టితే
ఏల సిగ్గులవడేవు యింతలో నీవు
వాలాయించి వేరొకతె వచ్చేది యెఱఁగఁజుమ్మీ
మేలిమి వూడిగాన మెప్పించితిఁగాని
(॥నీవ॥)
వురాన నలమేల్మంగ వుండఁగా నీకు మొక్కితే
వెరవు లేమి యెంచేవు వేసాన నీవు
నిరతి శ్రీవేంకటేశ నే నిన్నుఁబెండ్లాడితి
విరసముగాదు సుమ్మీ వేడుకగాని
(||pallavi||)
nī vallane yī sem̐talu nĕṭṭana bāyiḍam̐ baḍĕ
kāvariṁcham̐ jummī ichchagamu sesidim̐gāni
(||nīva||)
pavvaḽiṁchi vuṁḍam̐gānu pakkanam̐ dĕraveside
navvu lemi navvevu nādo nīvu
yĕvvadĕgum̐ gāsuguṁḍe dĕram̐gam̐ jummī nenu
sivvana nubasāramu sesidigāni
(||nīva||)
veḽado vegiṁcham̐gānu viḍelu vaddam̐ bĕṭṭide
ela siggulavaḍevu yiṁtalo nīvu
vālāyiṁchi verŏgadĕ vachchedi yĕṟam̐gam̐jummī
melimi vūḍigāna mĕppiṁchidim̐gāni
(||nīva||)
vurāna nalamelmaṁga vuṁḍam̐gā nīgu mŏkkide
vĕravu lemi yĕṁchevu vesāna nīvu
niradi śhrīveṁkaḍeśha ne ninnum̐bĕṁḍlāḍidi
virasamugādu summī veḍugagāni