Nee vallane vachche nidi ne nimta nerudunaa

నీ వల్లనే వచ్చె నిది నే నింత నేరుతునా
Language

(॥పల్లవి॥)
నీ వల్లనే వచ్చె నిది నే నింత నేరుతునా
చేవల్లకు వచ్చితేను శిరసెందుకు మోఁచునో

(॥నీవ॥)
చేరి నీవు చెనకఁగ సిగ్గు నేఁ బడఁగలనా
మారుకుమారు సేయక మానవచ్చునా
గోరు దాఁకించితినంటా కొసరుచుఁదిట్టేవు
యీరీతి నీతో పొందు యేమి సేఇంచునో

(॥నీవ॥)
మాటలు నీవాడఁగాను మౌనము నాకుఁ గలదా
యీటుకు నేఁ బెనఁగక యెట్టు మానుదు
వాఁటమై నవ్వితినంటా వద్దికిట్టె దగ్గరేవు
చాటి నీతో సరసము చవులెంతసేసునో

(॥నీవ॥)
కొంకక నీవు గూడఁగాను గుట్టు నేఁ జేయనున్నదా
అంకెల నిట్టె కాఁగిట నలరితిని
ఇంకా శ్రీ వేంకటేశ యెంతకెంత జరసేవు
లంకెలసమరతుల లావు లెంతవచ్చునో

(||pallavi||)
nī vallane vachchĕ nidi ne niṁta nerudunā
sevallagu vachchidenu śhirasĕṁdugu mom̐suno

(||nīva||)
seri nīvu sĕnagam̐ga siggu nem̐ baḍam̐galanā
mārugumāru seyaga mānavachchunā
goru dām̐kiṁchidinaṁṭā kŏsarusum̐diṭṭevu
yīrīdi nīdo pŏṁdu yemi seiṁchuno

(||nīva||)
māḍalu nīvāḍam̐gānu maunamu nāgum̐ galadā
yīḍugu nem̐ bĕnam̐gaga yĕṭṭu mānudu
vām̐ṭamai navvidinaṁṭā vaddigiṭṭĕ daggarevu
sāḍi nīdo sarasamu savulĕṁtasesuno

(||nīva||)
kŏṁkaga nīvu gūḍam̐gānu guṭṭu nem̐ jeyanunnadā
aṁkĕla niṭṭĕ kām̐giḍa nalaridini
iṁkā śhrī veṁkaḍeśha yĕṁtagĕṁta jarasevu
laṁkĕlasamaradula lāvu lĕṁtavachchuno