నీ వల్లఁ గడమ లేదు నిజమూర్తివి
(॥పల్లవి॥)
నీ వల్లఁ గడమ లేదు నిజమూర్తివి
వావిరి సుఖించ నేర్చేవారి వారి పుణ్యమూ
(॥నీవల్ల॥)
కొలిచే మనేవారికి కోరినయేలికవు
తలిఁచే మనేవారికి దైవమవూ
సొలనే మనేవారికి చుట్టమవు నీవు
వలసి నందు భావించేవారివారి పుణ్యము
(॥నీవల్ల॥)
తగిలే మనేవారికి ధనథాన్యమవు నీవు
పగటు కృషికులకు పాఁడిపంటవూ
తగిలిన యోగీంద్రులకు తత్త్వరహస్యము నీవు
వగలఁ దెలుసుకొనేవారివారి పుణ్యము
(॥నీవల్ల॥)
చదివే మనేవారికి సర్వశాస్త్రములు నీవు
మొదల నందరికిని మూలమవు
కదిసి శ్రీవేంకటేశ గతి నా కైతే నీవు
వదలక చేపట్టేవారివారి పుణ్యము
(||pallavi||)
nī vallam̐ gaḍama ledu nijamūrdivi
vāviri sukhiṁcha nersevāri vāri puṇyamū
(||nīvalla||)
kŏlise manevārigi korinayeligavu
talim̐se manevārigi daivamavū
sŏlane manevārigi suṭṭamavu nīvu
valasi naṁdu bhāviṁchevārivāri puṇyamu
(||nīvalla||)
tagile manevārigi dhanathānyamavu nīvu
pagaḍu kṛṣhigulagu pām̐ḍibaṁṭavū
tagilina yogīṁdrulagu tattvarahasyamu nīvu
vagalam̐ dĕlusugŏnevārivāri puṇyamu
(||nīvalla||)
sadive manevārigi sarvaśhāstramulu nīvu
mŏdala naṁdarigini mūlamavu
kadisi śhrīveṁkaḍeśha gadi nā kaide nīvu
vadalaga sebaṭṭevārivāri puṇyamu