నీ వద్దికి వీఁడే వచ్చె నీకోరికె లీడేరె
(॥పల్లవి॥)
నీ వద్దికి వీఁడే వచ్చె నీకోరికె లీడేరె
కైవసమాయఁ బనులు కళవళించకువే
(॥నీవ॥)
పన్నీటికాలువసుమ్మి బాసటపుటేరు గాదు
పున్నమ చంద్రుఁడు సుమ్మ భూతము గాఁడు
వెన్నెల లివె సుమ్మి వేసవి యెండలు గావు
కన్నెరో విభునిఁ బాసి కళవళించుకువే
(॥నీవ॥)
కప్పరము సుమ్మి యది కంతుపెట్లుప్ప గాదు
పుప్పొడి సుమ్మి చొక్కు బూడిదె కాదు
వొప్పఁగుఁదేఁటులు సుమ్మి వుంటవింటి గుండ్లుగావు
కప్పిన విరహమునఁ గళవళించకువే
(॥నీవ॥)
గందపు మాఁకులు సుమ్మీ కారడవి యది గాదు
అందపు మొగ్గలు సుమ్మి అమ్ములు గావు
ఇందువచ్చి శ్రీవేంకటేశుఁడు నిన్నిదెకూడె
కందువ మన్నన లిచ్చె గళవళించకువే
(||pallavi||)
nī vaddigi vīm̐ḍe vachchĕ nīgorigĕ līḍerĕ
kaivasamāyam̐ banulu kaḽavaḽiṁchaguve
(||nīva||)
pannīḍigāluvasummi bāsaḍabuḍeru gādu
punnama saṁdrum̐ḍu summa bhūdamu gām̐ḍu
vĕnnĕla livĕ summi vesavi yĕṁḍalu gāvu
kannĕro vibhunim̐ bāsi kaḽavaḽiṁchuguve
(||nīva||)
kapparamu summi yadi kaṁtubĕṭluppa gādu
puppŏḍi summi sŏkku būḍidĕ kādu
vŏppam̐gum̐dem̐ṭulu summi vuṁṭaviṁṭi guṁḍlugāvu
kappina virahamunam̐ gaḽavaḽiṁchaguve
(||nīva||)
gaṁdabu mām̐kulu summī kāraḍavi yadi gādu
aṁdabu mŏggalu summi ammulu gāvu
iṁduvachchi śhrīveṁkaḍeśhum̐ḍu ninnidĕgūḍĕ
kaṁduva mannana lichchĕ gaḽavaḽiṁchaguve