Nee vaamdanai nenu nichchalu samsaaramu

నీ వాఁడనై నేను నిచ్చలు సంసారము
Language

(॥పల్లవి॥)
నీ వాఁడనై నేను నిచ్చలు సంసారము
యే విధి నుండిన నీకే యింతా శలవు

(॥నీవా॥)
కొమ్మ రాణివాసమై కోరి మూల నుండినాను
నెమ్మది దినాలు మగనికి శలవు
కమ్మి వడ్డించినయట్టి కంచములోని కూర లెల్లా
దొమ్మి విందారగించేది దొరకే శలవు

(॥నీవా॥)
పంట కొలుచు కొటారున పాఁతరలోఁ బెట్టినాను
అంటక రాచముద్రకు ఆదే శలవు
యింటివాఁడి జన్నె వట్టి యెంత వుద్దిఁ బెట్టినాను
వెంట వెంటఁ దన యిలువేల్పులకే శలవు

(॥నీవా॥)
పెక్కువ సొమ్ములు దాఁచి పెట్టిలోన నుండినాను
నిక్కము సొమ్ముగలవానికే శలవు
అక్కజపు శ్రీ వేంకటాధిప నీ శరణంటి
మిక్కుటపు నా జన్మము మీకే శలవు

(||pallavi||)
nī vām̐ḍanai nenu nichchalu saṁsāramu
ye vidhi nuṁḍina nīge yiṁtā śhalavu

(||nīvā||)
kŏmma rāṇivāsamai kori mūla nuṁḍinānu
nĕmmadi dinālu maganigi śhalavu
kammi vaḍḍiṁchinayaṭṭi kaṁchamuloni kūra lĕllā
dŏmmi viṁdāragiṁchedi dŏrage śhalavu

(||nīvā||)
paṁṭa kŏlusu kŏḍāruna pām̐taralom̐ bĕṭṭinānu
aṁṭaga rāsamudragu āde śhalavu
yiṁṭivām̐ḍi jannĕ vaṭṭi yĕṁta vuddim̐ bĕṭṭinānu
vĕṁṭa vĕṁṭam̐ dana yiluvelbulage śhalavu

(||nīvā||)
pĕkkuva sŏmmulu dām̐si pĕṭṭilona nuṁḍinānu
nikkamu sŏmmugalavānige śhalavu
akkajabu śhrī veṁkaḍādhiba nī śharaṇaṁṭi
mikkuḍabu nā janmamu mīge śhalavu