Nee vaabegu magamdavu nerubarivi

నీ వాపెకు మగఁడవు నేరుపరివి
Language

(॥పల్లవి॥)
నీ వాపెకు మగఁడవు నేరుపరివి
సేవ లాపె చేసినవి చేకొనఁగరాదా

(॥నీవా॥)
సరసమాడఁగఁబోతే చన్నులపై కొంగు జారె
కరముల మొక్కితే కంకణాలు జారె
శిరసు వంచి యందుకు సిగ్గువడి వున్న దిదె
తరుణి నుపచరించ దండకు రారాదా

(॥నీవా॥)
పొంచి కానుకియ్యఁగాను పోఁక ముడి వదలెను
కొంచక పాదాలొత్తఁగా కొప్పు గదలె
అంచెల నంతలోననే అలసి నివ్వెరగొందె
చెంచెలాక్షి సేదదేర్చి చనవియ్యరాదా

(॥నీవా॥)
గందము నీకుఁ బూయఁగా కాఁగిటిలోనఁ దగిలె
సందడిఁ బల్కఁగా మోవి చవులు రేఁగె
అంది శ్రీ వేంకటేశుఁడ ఆనందించుకొన్నది
ఇందుముఖి బాలఁ జిక్కి ఇంపు చూపరాదా

(||pallavi||)
nī vābĕgu magam̐ḍavu nerubarivi
seva lābĕ sesinavi segŏnam̐garādā

(||nīvā||)
sarasamāḍam̐gam̐bode sannulabai kŏṁgu jārĕ
karamula mŏkkide kaṁkaṇālu jārĕ
śhirasu vaṁchi yaṁdugu sigguvaḍi vunna didĕ
taruṇi nubasariṁcha daṁḍagu rārādā

(||nīvā||)
pŏṁchi kānugiyyam̐gānu pom̐ka muḍi vadalĕnu
kŏṁchaga pādālŏttam̐gā kŏppu gadalĕ
aṁchĕla naṁtalonane alasi nivvĕragŏṁdĕ
sĕṁchĕlākṣhi sedadersi sanaviyyarādā

(||nīvā||)
gaṁdamu nīgum̐ būyam̐gā kām̐giḍilonam̐ dagilĕ
saṁdaḍim̐ balgam̐gā movi savulu rem̐gĕ
aṁdi śhrī veṁkaḍeśhum̐ḍa ānaṁdiṁchugŏnnadi
iṁdumukhi bālam̐ jikki iṁpu sūbarādā