Nee vaabebai battiyauda neneramganu

నీ వాపెపై బత్తియౌత నేనెరఁగను
Language

(॥పల్లవి॥)
నీ వాపెపై బత్తియౌత నేనెరఁగను
చేవమీరఁ దొల్లే బుద్ది చెప్పవద్దా నాకు

(॥నీవా॥)
నలువంకా నీతోనే నవ్విన నవ్వులెల్లా
యెలమి నాపెతో నీవు యేల చెప్పేవు
కలవరించి నీసతిఁ గాఁతాళించి నేఁ దిట్టితే
చెలరేఁగి నీవేల చిన్నఁబోయేవు

(॥నీవా॥)
పెనఁగఁగా నాగోరు బెరసి నిన్ను సోఁకితే
యెనసి యాపెకు నీవేమి చూపేవు
కని తా నీవద్ద నుండఁగా మరిచి నే దొబ్బితే
తనివి లేక నీవెంత తలవంచేవు

(॥నీవా॥)
తమకించి నాచన్నులఁ దగ నిన్ను నొత్తితేను
సముకాన నాపెకేల సన్న సేసేవు
అమర శ్రీవెంకటేశ అలమేల్ మంగనే నేను
సమరతి నిద్దరికిఁ జనవు లిచ్చేవు

(||pallavi||)
nī vābĕbai battiyauda nenĕram̐ganu
sevamīram̐ dŏlle buddi sĕppavaddā nāgu

(||nīvā||)
naluvaṁkā nīdone navvina navvulĕllā
yĕlami nābĕdo nīvu yela sĕppevu
kalavariṁchi nīsadim̐ gām̐tāḽiṁchi nem̐ diṭṭide
sĕlarem̐gi nīvela sinnam̐boyevu

(||nīvā||)
pĕnam̐gam̐gā nāgoru bĕrasi ninnu som̐kide
yĕnasi yābĕgu nīvemi sūbevu
kani tā nīvadda nuṁḍam̐gā marisi ne dŏbbide
tanivi lega nīvĕṁta talavaṁchevu

(||nīvā||)
tamagiṁchi nāsannulam̐ daga ninnu nŏttidenu
samugāna nābĕgela sanna sesevu
amara śhrīvĕṁkaḍeśha alamel maṁgane nenu
samaradi niddarigim̐ janavu lichchevu