నీ తోడివారమా నిను దూరేమా నీ
(॥పల్లవి॥)
నీ తోడివారమా నిను దూరేమా నీ-
చేతిలోనివారము నీ చిత్తము నా భాగ్యము
(॥నీతో॥)
బీరమాడి బెళకేవు పెనఁగి తలవంచేవు
ఔరా నీపొందు లెందుకై నావచ్చును
మారుమలనే వప్పటి మరి రండూ నడుపేవు
నేరుతు వన్నిపనులు నేనెఱఁగఁగాని
(॥నీతో॥)
అడిగి పెచ్చువెరిగే వానించి పంత మాడేవు
యెడరు నీసుద్దు లేమ నెంచవచ్చును
బడి బడి నిలిచేవు పట్టేవు కోకకొంగులు
గడుస వన్నిటా నీవు కడుముద్దరాలను
(॥నీతో॥)
బోదించి చిగిరించేవు పూఁచి కడలుదొక్కేవు
ఆదిగొని నిన్నెట్టు గాదనవచ్చును
యీదెస శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పాదగు జాణవు నే నీ పలుకులోదానను
(||pallavi||)
nī toḍivāramā ninu dūremā nī-
sedilonivāramu nī sittamu nā bhāgyamu
(||nīdo||)
bīramāḍi bĕḽagevu pĕnam̐gi talavaṁchevu
aurā nībŏṁdu lĕṁdugai nāvachchunu
mārumalane vappaḍi mari raṁḍū naḍubevu
nerudu vannibanulu nenĕṟam̐gam̐gāni
(||nīdo||)
aḍigi pĕchchuvĕrige vāniṁchi paṁta māḍevu
yĕḍaru nīsuddu lema nĕṁchavachchunu
baḍi baḍi nilisevu paṭṭevu kogagŏṁgulu
gaḍusa vanniḍā nīvu kaḍumuddarālanu
(||nīdo||)
bodiṁchi sigiriṁchevu pūm̐si kaḍaludŏkkevu
ādigŏni ninnĕṭṭu gādanavachchunu
yīdĕsa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
pādagu jāṇavu ne nī palugulodānanu