నీ తలనే వేఁగెనా నిన్ను దూరఁ బనిలేదు
(॥పల్లవి॥)
నీ తలనే వేఁగెనా నిన్ను దూరఁ బనిలేదు
జాతిఁ బుల్లఁ దీఁగెలకు సారె నలుగుదురు
(॥నీతలనే॥)
తియ్యని మాటలెపో తెఱవ మోవినాడేది
కయ్యమడిచి వూరకే కారమనేవు
అయ్యరో నీవేకాదు ఆలినొల్లనివారు
వొయ్యనె యీలకూరకు వుప్పు చాలదందురు
(॥నీతలనే॥)
చల్లని చూపులేపో సతికన్నులఁ జల్లేవి
వొల్లనివాఁడవై అవే వుడుకనేవు
మెల్లనె నీవేకాదు మేలుమేలు అంటే నీళ్ళు
బల్లిదులైనవారు పాటిగంపదెత్తురు
(॥నీతలనే॥)
కూరిమి కౌఁగిలేకా కొమ్మనిన్నుఁ గూడినది
బీరాన నీవేమిటికో బిగువనేవు
యీరీతి శ్రీ వేంకటేశ యేకమైతివితరులు
మేరమీరేవారిఁగంటే మిక్కిలి లోనౌదురు
(||pallavi||)
nī talane vem̐gĕnā ninnu dūram̐ baniledu
jādim̐ bullam̐ dīm̐gĕlagu sārĕ naluguduru
(||nīdalane||)
tiyyani māḍalĕbo tĕṟava movināḍedi
kayyamaḍisi vūrage kāramanevu
ayyaro nīvegādu ālinŏllanivāru
vŏyyanĕ yīlagūragu vuppu sāladaṁduru
(||nīdalane||)
sallani sūbulebo sadigannulam̐ jallevi
vŏllanivām̐ḍavai ave vuḍuganevu
mĕllanĕ nīvegādu melumelu aṁṭe nīḽḽu
ballidulainavāru pāḍigaṁpadĕtturu
(||nīdalane||)
kūrimi kaum̐gilegā kŏmmaninnum̐ gūḍinadi
bīrāna nīvemiḍigo biguvanevu
yīrīdi śhrī veṁkaḍeśha yegamaidividarulu
meramīrevārim̐gaṁṭe mikkili lonauduru