Nee talane vegenade nelamta yee suddulu

నీ తలనే వేగెనటే నెలఁత యీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
నీ తలనే వేగెనటే నెలఁత యీ సుద్దులు
ఆతని ననేముగాక ఆఁడువారు కరవా

(॥నీత॥)
పనిగలయప్పుడే పంతములెల్లా నాడేది
పెనఁగవచ్చితే నట్టె బిగిసేది
చెనకఁజూచినవేళే చేరి బాస లడిగేది
వొనరఁదుచ్చపువారివోజ లింతేకా

(॥నీత॥)
నగవచ్చినప్పుడేనంటుకొనఁ దిట్టేది
మొగము చూచినంతనే ముణిఁచేది
తగిలి వెనుకొంటేనే తరితీపు సేసేది
జగతిఁ జిత్తిణివారిసాజ మింతేకా

(॥నీత॥)
రతికిఁ దీసినప్పుడే రాజసము చూపేది
తతి వచ్చితేనే లోలోఁ దమకించేది
యితఁడె శ్రీవేంకటేశుఁ డిందరి మనలఁ గూడె
మితిమీరేది కాంతలమేకు లింతేకా

(||pallavi||)
nī talane vegĕnaḍe nĕlam̐ta yī suddulu
ādani nanemugāga ām̐ḍuvāru karavā

(||nīda||)
panigalayappuḍe paṁtamulĕllā nāḍedi
pĕnam̐gavachchide naṭṭĕ bigisedi
sĕnagam̐jūsinaveḽe seri bāsa laḍigedi
vŏnaram̐duchchabuvārivoja liṁtegā

(||nīda||)
nagavachchinappuḍenaṁṭugŏnam̐ diṭṭedi
mŏgamu sūsinaṁtane muṇim̐sedi
tagili vĕnugŏṁṭene taridību sesedi
jagadim̐ jittiṇivārisāja miṁtegā

(||nīda||)
radigim̐ dīsinappuḍe rājasamu sūbedi
tadi vachchidene lolom̐ damagiṁchedi
yidam̐ḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁdari manalam̐ gūḍĕ
midimīredi kāṁtalamegu liṁtegā