Nee talane vegenaa nem diduvamti valabu

నీ తలనే వేగెనా నేఁ డిటువంటి వలపు
Language

(॥పల్లవి॥)
నీ తలనే వేగెనా నేఁ డిటువంటి వలపు
కాతరాన నందరికిఁ గల చాలే కదవే

(॥నీతల॥)
కొప్పు గడు జారినది కూడ ముడుచుకోవే
చిప్పిలునవ్వులతో సిగ్గువడక
తొప్పఁదోఁగీఁ జెమటలు దుడుచుకోఁగదవే
దప్పిదేరేమోవితోడఁ దలవంచుకొనక

(॥నీతల॥)
చుక్కబొట్టు చెదరెను సొంపుగా దిద్దుకోవే
గక్కనను చెక్కుచేతఁ గప్పుకొనక
చక్కఁగా జిక్కువడిన సరు లమరించుకోవే
మక్కువ నీ చెలులను మాఁటువెట్టుకొనక

(॥నీతల॥)
కంకణాలు వదలెను కదియఁ బెట్టుకొనవే
కొంకుచుఁ బరాకు సేసుకొని యుండక
అంకెల శ్రీవేంకటేశుఁ డన్నిటాను నన్ను నేలె
యింకా నప్పటి నాతో నీడు వెట్టుకొనక

(||pallavi||)
nī talane vegĕnā nem̐ ḍiḍuvaṁṭi valabu
kādarāna naṁdarigim̐ gala sāle kadave

(||nīdala||)
kŏppu gaḍu jārinadi kūḍa muḍusugove
sippilunavvulado sigguvaḍaga
tŏppam̐dom̐gīm̐ jĕmaḍalu duḍusugom̐gadave
dappideremovidoḍam̐ dalavaṁchugŏnaga

(||nīdala||)
sukkabŏṭṭu sĕdarĕnu sŏṁpugā diddugove
gakkananu sĕkkusedam̐ gappugŏnaga
sakkam̐gā jikkuvaḍina saru lamariṁchugove
makkuva nī sĕlulanu mām̐ṭuvĕṭṭugŏnaga

(||nīdala||)
kaṁkaṇālu vadalĕnu kadiyam̐ bĕṭṭugŏnave
kŏṁkusum̐ barāgu sesugŏni yuṁḍaga
aṁkĕla śhrīveṁkaḍeśhum̐ ḍanniḍānu nannu nelĕ
yiṁkā nappaḍi nādo nīḍu vĕṭṭugŏnaga