Nee talane vegenaa nelamtaro yee kadalu

నీ తలనే వేగెనా నెలఁతరో యీ కతలు
Language

(॥పల్లవి॥)
నీ తలనే వేగెనా నెలఁతరో యీ కతలు
నాతుల సాజము లివి నవ్వు లింతేసేఁటికే

(॥నీతి॥)
వుడివోని తమకము లుమ్మగిలుతా నుండఁగా
పడఁతుల వయసులు పట్టవచ్చునా
అదియాస లేవు రేఁగి ఆయములు గరఁచఁగా
తడఁబాటు వలపులు దాఁచవచ్చునా

(॥నీతి॥)
పెనగొన్న వేడుకలు పెరుగుతానుండఁగాను
మునుకొన్న సిగ్గులు ముయ్యవచ్చునా
వొనరి మోవితేనియ లూటలెత్తి వడియఁగా
చెనకుచు కాఁపురాలు సేయకుండవచ్చునా

(॥నీతి॥)
చిప్పిలి రతివింతలు చెలఁగి చవులైవుండఁగా
చొప్పైన పొందులు తప్పించుకోవచ్చునా
ఇప్పడు శ్రీవేంకటేశుఁ గింతలోనె నిన్నునేలా
కప్పిన యీసంతోసము కాదనఁగ వచ్చునా

(||pallavi||)
nī talane vegĕnā nĕlam̐taro yī kadalu
nādula sājamu livi navvu liṁtesem̐ṭige

(||nīdi||)
vuḍivoni tamagamu lummagiludā nuṁḍam̐gā
paḍam̐tula vayasulu paṭṭavachchunā
adiyāsa levu rem̐gi āyamulu garam̐sam̐gā
taḍam̐bāḍu valabulu dām̐savachchunā

(||nīdi||)
pĕnagŏnna veḍugalu pĕrugudānuṁḍam̐gānu
munugŏnna siggulu muyyavachchunā
vŏnari movideniya lūḍalĕtti vaḍiyam̐gā
sĕnagusu kām̐purālu seyaguṁḍavachchunā

(||nīdi||)
sippili radiviṁtalu sĕlam̐gi savulaivuṁḍam̐gā
sŏppaina pŏṁdulu tappiṁchugovachchunā
ippaḍu śhrīveṁkaḍeśhum̐ giṁtalonĕ ninnunelā
kappina yīsaṁtosamu kādanam̐ga vachchunā