Nee talane vegenaa nelamtala saajamidi

నీ తలనే వేగెనా నెలఁతల సాజమిది
Language

(॥పల్లవి॥)
నీ తలనే వేగెనా నెలఁతల సాజమిది
చేతులెత్తి మొక్కి యేమే సెలవుల నవ్వేవు

(॥॥)
చెమరించె మేనంటా సిగ్గుల నేల లోఁగేవే
తమిరేఁగె మతినంటా తల యేలవంచేవే
తిమిరీ వలపులంటా తెరయేల చొచ్చేవే
రమణునిఁ జూచితేఁ గరఁ గరా మానినులు

(॥॥)
కడునుబ్బెఁ జన్నులంటా కప్పనేలే పయ్యదను
అడరీ నిట్టూర్పులంటా నవేల నీవణఁ చేవే
పొడమీఁ బులకలంటా పొందులేల దాచేవే
బడినే మగఁడంటేను భ్రమయరా చెలులు

(॥॥)
భావము దెలిసీనంటా పరాకులేల సేసేవే
దేవు లనేరంటా నెంత తేరి సింగారించేవే
నీ వలమేల్మంగవు నిన్నితఁడే రతిఁగూడె
శ్రీ వేంకటేశ్వరుఁ బొంది చెలఁగరా సతులు

(||pallavi||)
nī talane vegĕnā nĕlam̐tala sājamidi
sedulĕtti mŏkki yeme sĕlavula navvevu

(||||)
sĕmariṁchĕ menaṁṭā siggula nela lom̐geve
tamirem̐gĕ madinaṁṭā tala yelavaṁcheve
timirī valabulaṁṭā tĕrayela sŏchcheve
ramaṇunim̐ jūsidem̐ garam̐ garā māninulu

(||||)
kaḍunubbĕm̐ jannulaṁṭā kappanele payyadanu
aḍarī niṭṭūrbulaṁṭā navela nīvaṇam̐ seve
pŏḍamīm̐ bulagalaṁṭā pŏṁdulela dāseve
baḍine magam̐ḍaṁṭenu bhramayarā sĕlulu

(||||)
bhāvamu dĕlisīnaṁṭā parāgulela seseve
devu laneraṁṭā nĕṁta teri siṁgāriṁcheve
nī valamelmaṁgavu ninnidam̐ḍe radim̐gūḍĕ
śhrī veṁkaḍeśhvarum̐ bŏṁdi sĕlam̐garā sadulu