నీ తలనే వేగెనా నీవేల సిగ్గువడేవే
(॥పల్లవి॥)
నీ తలనే వేగెనా నీవేల సిగ్గువడేవే
యీతల నీ విభునితో నెట్టున్నాఁ జెల్లునే
(॥నీత॥)
మనసులోపలియాస మర్మములు వెడరేఁచి
పెనఁగించి ప్రియులను బెరయించును
తనువుపః జవ్వనము తమకములు వుట్టించి
చెనకించి సేయరాని చేఁతులు సేయించును
(॥నీత॥)
యిక్కువైన వలపులు యెంతటివారికైనా
చొక్కించి యెదురులు చూపించును
మక్కువైన మాఁటలు మరి చవులు వుట్టించి
వొక్కటిసేసి రతుల నోలలాడింపించును
(॥నీత॥)
యేకతపు సరసాలు యిద్దరిఁ గాఁగిటఁ గుచ్చి
చేకొని చుట్టరికముసేయించును
తూకొని శ్రీవేంకటేశుతోడి నవ్వు లిట్టె నిన్ను
యీకటఁ బెండ్లాడించె ని న్నింకా నీడేరించును
(||pallavi||)
nī talane vegĕnā nīvela sigguvaḍeve
yīdala nī vibhunido nĕṭṭunnām̐ jĕllune
(||nīda||)
manasulobaliyāsa marmamulu vĕḍarem̐si
pĕnam̐giṁchi priyulanu bĕrayiṁchunu
tanuvubaḥ javvanamu tamagamulu vuṭṭiṁchi
sĕnagiṁchi seyarāni sem̐tulu seyiṁchunu
(||nīda||)
yikkuvaina valabulu yĕṁtaḍivārigainā
sŏkkiṁchi yĕdurulu sūbiṁchunu
makkuvaina mām̐ṭalu mari savulu vuṭṭiṁchi
vŏkkaḍisesi radula nolalāḍiṁpiṁchunu
(||nīda||)
yegadabu sarasālu yiddarim̐ gām̐giḍam̐ guchchi
segŏni suṭṭarigamuseyiṁchunu
tūgŏni śhrīveṁkaḍeśhudoḍi navvu liṭṭĕ ninnu
yīgaḍam̐ bĕṁḍlāḍiṁchĕ ni nniṁkā nīḍeriṁchunu