నీ తలనే వచ్చెనయ్యా నేరుపెల్లాను
(॥పల్లవి॥)
నీ తలనే వచ్చెనయ్యా నేరుపెల్లాను
కాతరించి సతులపై కాఁక చూపవలెనా
(॥॥)
కోమలుల తిట్టులకు కోపగించే వింతలోనే
యేమీ నీమగతన మిందుమీఁదనా
చేముట్టి గోరనూఁదితే చిడుముడికే పడేవు
సాము సేసిన బీరమిచ్చటఁ జూపవలెనా
(॥॥)
సతుల యెంగిలికీట్టే జడిసేవు కమ్మటిని
యితవైన నీయాచారా లిందుకొరకా
రతివేళఁ బాదములొరసితే నెగ్గుపట్టేవు
తతి నీపెద్దరిక మింతటఁ జూపవలెనా
(॥॥)
లలనల చనుఁగొండలకుఁ జేయి చాఁచేవు
బలవంతుఁడవౌత యీపాటెరఁగమా
అలమేలుమంగను నేనట్టే శ్రీవేంకటేశుఁడ
కలసితివి నీమేలిక్కడఁ జూపవలెనా
(||pallavi||)
nī talane vachchĕnayyā nerubĕllānu
kādariṁchi sadulabai kām̐ka sūbavalĕnā
(||||)
komalula tiṭṭulagu kobagiṁche viṁtalone
yemī nīmagadana miṁdumīm̐danā
semuṭṭi goranūm̐dide siḍumuḍige paḍevu
sāmu sesina bīramichchaḍam̐ jūbavalĕnā
(||||)
sadula yĕṁgiligīṭṭe jaḍisevu kammaḍini
yidavaina nīyāsārā liṁdugŏragā
radiveḽam̐ bādamulŏraside nĕggubaṭṭevu
tadi nībĕddariga miṁtaḍam̐ jūbavalĕnā
(||||)
lalanala sanum̐gŏṁḍalagum̐ jeyi sām̐sevu
balavaṁtum̐ḍavauda yībāḍĕram̐gamā
alamelumaṁganu nenaṭṭe śhrīveṁkaḍeśhum̐ḍa
kalasidivi nīmelikkaḍam̐ jūbavalĕnā