నీ తలఁపు లీడేరె నెలఁత నీకు దక్కె
(॥పల్లవి॥)
నీ తలఁపు లీడేరె నెలఁత నీకు దక్కె
రాతిరిఁ బగలు నింత రవ్వలేలా
(॥నీత॥)
ఆపెతో మాటలాడితి వందుకొంటివి కానికె
పైపైఁ గొంకుదేరెను పలుకులేలా
మోపులుగా నవ్వితివి మొగము చూచితివి
మాపుదాఁకా నిఁక వట్టిమాఁటలేల
(॥నీత॥)
సతిఁ గొంగుపట్టితివి సరసములాడితివి
సతమాయను మనువు సాదించనేల
యితవులు చేకొంటివి యింటి కిట్టె వచ్చితివి
కతలెల్లాఁ జెప్పి నిన్ను కాతరించనేల
(॥నీత॥)
కూటములు మెచ్చితివి కొమ్మఁ బెండ్లాడితివి
సూటికెక్కె వలపులు సుద్దు లింకేల
యీటున శ్రీవేంకటేశ యే నలములుమంగను
గాట్రాన నన్నేలితివి గరిసించనేల
(||pallavi||)
nī talam̐pu līḍerĕ nĕlam̐ta nīgu dakkĕ
rādirim̐ bagalu niṁta ravvalelā
(||nīda||)
ābĕdo māḍalāḍidi vaṁdugŏṁṭivi kānigĕ
paibaim̐ gŏṁkuderĕnu palugulelā
mobulugā navvidivi mŏgamu sūsidivi
mābudām̐kā nim̐ka vaṭṭimām̐ṭalela
(||nīda||)
sadim̐ gŏṁgubaṭṭidivi sarasamulāḍidivi
sadamāyanu manuvu sādiṁchanela
yidavulu segŏṁṭivi yiṁṭi kiṭṭĕ vachchidivi
kadalĕllām̐ jĕppi ninnu kādariṁchanela
(||nīda||)
kūḍamulu mĕchchidivi kŏmmam̐ bĕṁḍlāḍidivi
sūḍigĕkkĕ valabulu suddu liṁkela
yīḍuna śhrīveṁkaḍeśha ye nalamulumaṁganu
gāṭrāna nannelidivi garisiṁchanela