నీ తలఁపెట్టున్నదో నే మెఱఁగము
(॥పల్లవి॥)
నీ తలఁపెట్టున్నదో నే మెఱఁగము
యీ తలవాకిట నుండే విదే యేమో కాని
(॥॥)
సతులు విభుని మీఁద సణఁగులు రాలుతురు
మతకము వెట్టు కొని మాటాడుదురు
కతకారితనముల కాఁకలు సేతురు
పతి యందు కెగ్గు పట్టఁ బాడిగాదు గాని
(॥॥)
పొట్టఁ బొరుగున నుండి బొమ్మల జంకింతురు
గుట్టు తోడ నూరకైనాఁ గొసరుదురు
చిట్టకపు వనితలు చెనకి పెనఁగుదురు
అట్టే మగని కౌఁగా దనఁగాదు గాని
(॥॥)
అచ్చమైన దేవుళ్ళు ఆసపడి కూడుదురు
తచ్చి తచ్చి రతులకుఁ దమకింతురు
హెచ్చి శ్రీ వేంకటేశ ని న్నెనసె నలమేల్మంగ
మచ్చికైన విభుఁడవు మానరాదు గాని
(||pallavi||)
nī talam̐pĕṭṭunnado ne mĕṟam̐gamu
yī talavāgiḍa nuṁḍe vide yemo kāni
(||||)
sadulu vibhuni mīm̐da saṇam̐gulu rāluduru
madagamu vĕṭṭu kŏni māḍāḍuduru
kadagāridanamula kām̐kalu seduru
padi yaṁdu kĕggu paṭṭam̐ bāḍigādu gāni
(||||)
pŏṭṭam̐ bŏruguna nuṁḍi bŏmmala jaṁkiṁturu
guṭṭu toḍa nūragainām̐ gŏsaruduru
siṭṭagabu vanidalu sĕnagi pĕnam̐guduru
aṭṭe magani kaum̐gā danam̐gādu gāni
(||||)
achchamaina devuḽḽu āsabaḍi kūḍuduru
tachchi tachchi radulagum̐ damagiṁturu
hĕchchi śhrī veṁkaḍeśha ni nnĕnasĕ nalamelmaṁga
machchigaina vibhum̐ḍavu mānarādu gāni