నీ తలఁ పెట్టున్నదో నే మెరగఁము
(॥పల్లవి॥)
నీ తలఁ పెట్టున్నదో నే మెరగఁము
రాతిరెల్ల నేము జాగరములే సేసితిమి
(॥నీతలఁ॥)
చింతదీర నీతోడ చేరి మాటాడిన దాఁకా
కాంతకుఁ దనలోని కాఁక మానదు
మంతనాన తానే నీ మనసు దెలియుదాఁకా
యింతట నంతటినుండి యెదురు చూచీని
(॥నీతలఁ॥)
దగ్గరి కూచుండి నీతోఁ దగిలి నవ్వినదాఁకా
అగ్గమైన తన ఆస దీరదు
సిగ్గుదీర నీకుఁ దానే సేవసేసేనంటే
వొగ్గి నీవొద్దికిఁ దనవువిదల నంపెను
(॥నీతలఁ॥)
గక్కన నీమోముఁ దనకన్నులఁ జూచినదాఁకా
మొక్కలపుఁ దనలోని ముచ్చట వోదు
యిక్కు వెరిఁగి శ్రీవేంకటేశ యింతిఁ గూడితివి
వెక్కసపునంతసాల విఱ్ఱవీఁగీ నిదివో
(||pallavi||)
nī talam̐ pĕṭṭunnado ne mĕragam̐mu
rādirĕlla nemu jāgaramule sesidimi
(||nīdalam̐||)
siṁtadīra nīdoḍa seri māḍāḍina dām̐kā
kāṁtagum̐ danaloni kām̐ka mānadu
maṁtanāna tāne nī manasu dĕliyudām̐kā
yiṁtaḍa naṁtaḍinuṁḍi yĕduru sūsīni
(||nīdalam̐||)
daggari kūsuṁḍi nīdom̐ dagili navvinadām̐kā
aggamaina tana āsa dīradu
siggudīra nīgum̐ dāne sevasesenaṁṭe
vŏggi nīvŏddigim̐ danavuvidala naṁpĕnu
(||nīdalam̐||)
gakkana nīmomum̐ danagannulam̐ jūsinadām̐kā
mŏkkalabum̐ danaloni muchchaḍa vodu
yikku vĕrim̐gi śhrīveṁkaḍeśha yiṁtim̐ gūḍidivi
vĕkkasabunaṁtasāla viṭravīm̐gī nidivo