నీ సుద్దులు వింటేను నిచ్చకొత్తలు నీకు
(॥పల్లవి॥)
నీ సుద్దులు వింటేను నిచ్చకొత్తలు నీకు
ఆస యెంతైనాఁ గద్దు ఆఁడువారి మీఁదను
(॥నీసు॥)
యేడనుండితి విందాఁకా నెవ్వతె నీతో మాటాడె
జాడతో నీపొందులెల్లా సాగివచ్చునా
వేడుకకాఁడవు తొల్లె వేసారవు నీ వెపుడు
వాడికగా మాఇంటికి వచ్చితివి నేఁడు
(॥నీసు॥)
సేయవలసినదేమి చెంత నీకేమి ప్రియము
కాయజకేలి నీమతి కాఁకదేరెనా
చాయసేసుకోఁ గలవు జాణతనాలు నేర్తువు
చేయిమీఁదుగా మముఁ జెనకి నవ్వేవు
(॥నీసు॥)
యెట్టివి నీతలఁపులు యెన్నఁడు నీకాంగిలి
నెట్టుకొన్ననీకోరికె నెరవేరెనా
యిట్టె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
గుట్టున మమ్మేలితివి కోవిదుఁడ వౌదువు
(||pallavi||)
nī suddulu viṁṭenu nichchagŏttalu nīgu
āsa yĕṁtainām̐ gaddu ām̐ḍuvāri mīm̐danu
(||nīsu||)
yeḍanuṁḍidi viṁdām̐kā nĕvvadĕ nīdo māḍāḍĕ
jāḍado nībŏṁdulĕllā sāgivachchunā
veḍugagām̐ḍavu tŏllĕ vesāravu nī vĕbuḍu
vāḍigagā māiṁṭigi vachchidivi nem̐ḍu
(||nīsu||)
seyavalasinademi sĕṁta nīgemi priyamu
kāyajageli nīmadi kām̐kaderĕnā
sāyasesugom̐ galavu jāṇadanālu nerduvu
seyimīm̐dugā mamum̐ jĕnagi navvevu
(||nīsu||)
yĕṭṭivi nīdalam̐pulu yĕnnam̐ḍu nīgāṁgili
nĕṭṭugŏnnanīgorigĕ nĕraverĕnā
yiṭṭĕ śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
guṭṭuna mammelidivi kovidum̐ḍa vauduvu