నీ సుద్దు లేమిచెప్పేవు నే నెరఁగనా
(॥పల్లవి॥)
నీ సుద్దు లేమిచెప్పేవు నే నెరఁగనా
ఆసవెట్టి నన్ను నింత ఆదరించేవుగాక
(॥నీసు॥)
తారుకాణంచితే యిట్టె దంటవై యేమి చూచేవు
కోరి యాపె విడె మందుకొనవా నీవ
సారె సారె నందుకుఁగా చలమేల సాదించవు
చేరి యాపెఁ గొనగోరఁ జెనకవా నీవు
(॥నీసు॥)
మచ్చెము నీమై యుండఁగా మరియేలజంకించేవు
నచ్చుకొట్టి యాపెతోడ నవ్వవా నీవు
నిచ్చెలుల నడిగించి నిజమెంత నెరపేవు
పచ్చిదేర నాపె పక్కఁ బండుండవా నీవు
(॥నీసు॥)
తోడ దిష్టము చూపితే దొమ్మిఁ గాఁగిలించేవు
జోడై యాపె మోవి చవిచూడవా నీవు
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వాడిక నాపెకుఁ దొల్లి వలవవా నీవు
(||pallavi||)
nī suddu lemisĕppevu ne nĕram̐ganā
āsavĕṭṭi nannu niṁta ādariṁchevugāga
(||nīsu||)
tārugāṇaṁchide yiṭṭĕ daṁṭavai yemi sūsevu
kori yābĕ viḍĕ maṁdugŏnavā nīva
sārĕ sārĕ naṁdugum̐gā salamela sādiṁchavu
seri yābĕm̐ gŏnagoram̐ jĕnagavā nīvu
(||nīsu||)
machchĕmu nīmai yuṁḍam̐gā mariyelajaṁkiṁchevu
nachchugŏṭṭi yābĕdoḍa navvavā nīvu
nichchĕlula naḍigiṁchi nijamĕṁta nĕrabevu
pachchidera nābĕ pakkam̐ baṁḍuṁḍavā nīvu
(||nīsu||)
toḍa diṣhṭamu sūbide dŏmmim̐ gām̐giliṁchevu
joḍai yābĕ movi savisūḍavā nīvu
yīḍane śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vāḍiga nābĕgum̐ dŏlli valavavā nīvu