నీ సుద్దు లెల్లా విని నీకె మనసు పట్టీ
(॥పల్లవి॥)
నీ సుద్దు లెల్లా విని నీకె మనసు పట్టీ
ఆసపడి వున్నది నీ వాకెఁ జేకొనవయ్యా
(॥॥)
చందమామ వంటి మోము చక్కఁదనములపోగు
కుందనఁపు వంటి మేను కోమలపుదీ
అందపు నీలాలగని అతివకు పెనుఁగొప్పు
పొంద నీకే తగు నొక్క పొలఁతి వున్నదయ్యా
(॥॥)
కొండల వంటి చన్నులు గుఱియైన బటువులు
అండనే సింహపునడుమతి సన్నము
గుండుఁ దీగెలే చేతులు కొనబైన(?) సోగలు
నిండు జవ్వని వున్నది నీకే తగునయ్యా
(॥॥)
వలయపు బండి కండ్లు వంటి పిఱుఁదు ఘనము
జలజపుఁ బాదములు సైకమైనవి
యెలమి శ్రీ వేంకటేశ యెనసి నీ వురముపై
అలమేల్మంగ నీ కున్న దాపె తగునయ్యా
(||pallavi||)
nī suddu lĕllā vini nīgĕ manasu paṭṭī
āsabaḍi vunnadi nī vāgĕm̐ jegŏnavayyā
(||||)
saṁdamāma vaṁṭi momu sakkam̐danamulabogu
kuṁdanam̐pu vaṁṭi menu komalabudī
aṁdabu nīlālagani adivagu pĕnum̐gŏppu
pŏṁda nīge tagu nŏkka pŏlam̐ti vunnadayyā
(||||)
kŏṁḍala vaṁṭi sannulu guṟiyaina baḍuvulu
aṁḍane siṁhabunaḍumadi sannamu
guṁḍum̐ dīgĕle sedulu kŏnabaina(?) sogalu
niṁḍu javvani vunnadi nīge tagunayyā
(||||)
valayabu baṁḍi kaṁḍlu vaṁṭi piṟum̐du ghanamu
jalajabum̐ bādamulu saigamainavi
yĕlami śhrī veṁkaḍeśha yĕnasi nī vuramubai
alamelmaṁga nī kunna dābĕ tagunayyā