Nee sittamunam betti neeve dayadalamsevu

నీ చిత్తమునఁ బెట్టి నీవే దయదలఁచేవు
Language

(॥పల్లవి॥)
నీ చిత్తమునఁ బెట్టి నీవే దయదలఁచేవు
యేచి నీతో సారె సారె యెదురాడేనా

(॥నీచి॥)
నిన్నుఁ గొసరేమాఁట నన్నే కొసరుకొనే
యెన్నఁగ నిన్నుఁ గాదననేఁటికి నాకు
వున్నతిఁ బ్రోడవు నీవు కన్నెపడుచను నేను
సన్నలచాయల నీతో సరిదూఁగేనా

(॥నీచి॥)
నీతోఁ బెనఁగేమారు నేనే నాతోఁ బెనఁగేను
యేతువ గాసిసేయనేఁటికి నిన్ను
యీతల నీ వేలికవు యేలినదాన నేను
కాతరించి నీకంటె ఘనమయ్యేనా

(॥నీచి॥)
నీకు విన్నవించేమారు నేనే బుద్దినేర్చేను
యీకత లిన్నియుఁ జెప్పనేఁటికి నీతో
అకడశ్రీవేంకటేశ యలమేల్ మంగను నేను
పైకొని కూడితి నింకాఁ బంతమాడేనా

(||pallavi||)
nī sittamunam̐ bĕṭṭi nīve dayadalam̐sevu
yesi nīdo sārĕ sārĕ yĕdurāḍenā

(||nīsi||)
ninnum̐ gŏsaremām̐ṭa nanne kŏsarugŏne
yĕnnam̐ga ninnum̐ gādananem̐ṭigi nāgu
vunnadim̐ broḍavu nīvu kannĕbaḍusanu nenu
sannalasāyala nīdo saridūm̐genā

(||nīsi||)
nīdom̐ bĕnam̐gemāru nene nādom̐ bĕnam̐genu
yeduva gāsiseyanem̐ṭigi ninnu
yīdala nī veligavu yelinadāna nenu
kādariṁchi nīgaṁṭĕ ghanamayyenā

(||nīsi||)
nīgu vinnaviṁchemāru nene buddinersenu
yīgada linniyum̐ jĕppanem̐ṭigi nīdo
agaḍaśhrīveṁkaḍeśha yalamel maṁganu nenu
paigŏni kūḍidi niṁkām̐ baṁtamāḍenā