Nee sittamugolamdimte nenemanenu

నీ చిత్తముకొలఁదింతే నేనేమనేను
Language

(॥పల్లవి॥)
నీ చిత్తముకొలఁదింతే నేనేమనేను
చేచేత నేమి సేసినాఁ జెల్లు నీకు నన్నియు

(॥నీచి॥)
దొసిట వెన్నెల వట్టి తొడికి చూపవచ్చునా
ఆసల నీకోరికింతంతనవచ్చునా
లాసి నాతోఁ బెనఁగేవు దోసమో అందుకేమి
సేసవెట్టినప్పుడే చెల్లు నీకు నన్నియు

(॥నీచి॥)
తగిలి యాకసమిట్టే తాసునఁ దూఁచవచ్చునా
జిగి నీమాఁటలకర్థాలు చెప్పవచ్చునా
నగుతా నేమడిగేవు నాకు నీతో బలిమా
చిగురుఁజేఁతలిప్పుడు చెల్లు నీకు నన్నియు

(॥నీచి॥)
కోవిలకూఁతలొక్కట గుంపు సేయవచ్చునా
ఆవటించి నీవేడుకలాఁపవచ్చునా
కావించి కూడితివి చేఁగల మఱ్ఱిచెన్నుఁడవై
శ్రీవెంకటేశుఁడ యింకఁ జెల్లు నీకు నన్నియు

(||pallavi||)
nī sittamugŏlam̐diṁte nenemanenu
seseda nemi sesinām̐ jĕllu nīgu nanniyu

(||nīsi||)
dŏsiḍa vĕnnĕla vaṭṭi tŏḍigi sūbavachchunā
āsala nīgorigiṁtaṁtanavachchunā
lāsi nādom̐ bĕnam̐gevu dosamo aṁdugemi
sesavĕṭṭinappuḍe sĕllu nīgu nanniyu

(||nīsi||)
tagili yāgasamiṭṭe tāsunam̐ dūm̐savachchunā
jigi nīmām̐ṭalagardhālu sĕppavachchunā
nagudā nemaḍigevu nāgu nīdo balimā
sigurum̐jem̐talippuḍu sĕllu nīgu nanniyu

(||nīsi||)
kovilagūm̐talŏkkaḍa guṁpu seyavachchunā
āvaḍiṁchi nīveḍugalām̐pavachchunā
kāviṁchi kūḍidivi sem̐gala maṭrisĕnnum̐ḍavai
śhrīvĕṁkaḍeśhum̐ḍa yiṁkam̐ jĕllu nīgu nanniyu