నీ చిత్తముకొలఁది నే నడచుట గాక
(॥పల్లవి॥)
నీ చిత్తముకొలఁది నే నడచుట గాక
చూచి చూచి నీ తోడి సూడు నాకుఁ జెల్లునా
(॥॥)
పంతము లాడఁగ నేల పైకొని మొక్కుట గాక
వంతు లేక వలచు నావంటి దానికి
అంతటి మీఁదట నీవు అన్నిటాను దొరవు
కొంతైన నీ మీఁదఁ గోపగించఁ జెల్లునా
(॥॥)
కపటము లిఁక నేల కన్నుల నప్పుట గాక
యెపుడును నావంటి యిల్లాలికి
నెపమునఁ దొలుతనే నీయిచ్చ రాజవు
విపరీతముగ నిన్ను వెగ్గళించఁ జెల్లునా
(॥॥)
కావరించ నిఁక నేల కౌఁగిలించు కొంటగాక
కైవసపు నావంటి కాంతకును
శ్రీ వేంకటేశ్వర నీవే చేరి నన్నుఁ గూడితివి
ఆవటించి యిఁక నిన్ను నలయించఁ జెల్లునా.
(||pallavi||)
nī sittamugŏlam̐di ne naḍasuḍa gāga
sūsi sūsi nī toḍi sūḍu nāgum̐ jĕllunā
(||||)
paṁtamu lāḍam̐ga nela paigŏni mŏkkuḍa gāga
vaṁtu lega valasu nāvaṁṭi dānigi
aṁtaḍi mīm̐daḍa nīvu anniḍānu dŏravu
kŏṁtaina nī mīm̐dam̐ gobagiṁcham̐ jĕllunā
(||||)
kabaḍamu lim̐ka nela kannula nappuḍa gāga
yĕbuḍunu nāvaṁṭi yillāligi
nĕbamunam̐ dŏludane nīyichcha rājavu
vibarīdamuga ninnu vĕggaḽiṁcham̐ jĕllunā
(||||)
kāvariṁcha nim̐ka nela kaum̐giliṁchu kŏṁṭagāga
kaivasabu nāvaṁṭi kāṁtagunu
śhrī veṁkaḍeśhvara nīve seri nannum̐ gūḍidivi
āvaḍiṁchi yim̐ka ninnu nalayiṁcham̐ jĕllunā.