Nee sittamu vachchidini nem jesinade bhaagyamo

నీ చిత్తము వచ్చితిని నేఁ జేసినదే భాగ్యమో
Language

(॥పల్లవి॥)
నీ చిత్తము వచ్చితిని నేఁ జేసినదే భాగ్యమో
చేచేత నీవు నన్నుఁ జెక్కులు నొక్కేవూ

(॥॥)
పలుకుఁదేనెల వారు బంతి బోజనాలవారు
చెలమి కత్తెలు నీకు సేనా సేన
యెలమి నీ కెందులోను యెవ్వతెఁ బోలుదు నేను
కలికి నంటా నన్నుఁ గడుఁ బొగడేవూ

(॥॥)
దగ్గరఁ గూచుండేవారు తమితోఁ జెనకేవారు
సిగ్గులు వడేవారు సేనాసేన
వొగ్గి నీకు సేవ సేసి వొడఁబడ నెంతదాన
తగ్గులేని గుణములదాన నంటా మెచ్చేవూ

(॥॥)
మఱుఁగున నుండేవారు మంతన మాడేవారు
చిఱునవ్వు నవ్వేవారు సేనాసేన
నెఱి నీ దేవుళ్ళలోను నే నేమి నేరుతును
గుఱిగా శ్రీ వేంకటేశ కూడి గారవించేవూ

(||pallavi||)
nī sittamu vachchidini nem̐ jesinade bhāgyamo
seseda nīvu nannum̐ jĕkkulu nŏkkevū

(||||)
palugum̐denĕla vāru baṁti bojanālavāru
sĕlami kattĕlu nīgu senā sena
yĕlami nī kĕṁdulonu yĕvvadĕm̐ boludu nenu
kaligi naṁṭā nannum̐ gaḍum̐ bŏgaḍevū

(||||)
daggaram̐ gūsuṁḍevāru tamidom̐ jĕnagevāru
siggulu vaḍevāru senāsena
vŏggi nīgu seva sesi vŏḍam̐baḍa nĕṁtadāna
tagguleni guṇamuladāna naṁṭā mĕchchevū

(||||)
maṟum̐guna nuṁḍevāru maṁtana māḍevāru
siṟunavvu navvevāru senāsena
nĕṟi nī devuḽḽalonu ne nemi nerudunu
guṟigā śhrī veṁkaḍeśha kūḍi gāraviṁchevū