Nee sittamu naa bhaagyamu nerubu limke munnavi

నీ చిత్తము నా భాగ్యము నేరుపు లింకే మున్నవి
Language

(॥పల్లవి॥)
నీ చిత్తము నా భాగ్యము నేరుపు లింకే మున్నవి
చూచినట్టు వచ్చీనా సూటితో వలపులు

(॥నీచిత్త॥)
యితవైతే మాఁటలు యెన్న్తెనా నాడఁగవలె
మతికి వెగటైతేను మానఁగవలె
కుతిలపు రారాఁపులఁ గొసరిఁగఁబోతేను
చుతురత లెన్న్తెనాఁ జవులు గాఁబోయీనా

(॥నీచిత్త॥)
చెల్లుబళ్లయితేను సేవలు సేయఁగవలె
వొల్లకుంటే గుట్టుతోడ నుండఁగవలె
పల్లదాన చనవులు పచారించఁబోతేను
వుల్లములో వేడుకలై యుండఁబోయీనా

(॥నీచిత్త॥)
చుట్టరిక మబ్చితేను సొలసి చూడఁగవలె
వట్టి పొందులైతే తలవంచుకోవలె
యట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మట్టులేని నీ రతులు మరచితేఁబోయినా

(||pallavi||)
nī sittamu nā bhāgyamu nerubu liṁke munnavi
sūsinaṭṭu vachchīnā sūḍido valabulu

(||nīsitta||)
yidavaide mām̐ṭalu yĕnndĕnā nāḍam̐gavalĕ
madigi vĕgaḍaidenu mānam̐gavalĕ
kudilabu rārām̐pulam̐ gŏsarim̐gam̐bodenu
sudurada lĕnndĕnām̐ javulu gām̐boyīnā

(||nīsitta||)
sĕllubaḽlayidenu sevalu seyam̐gavalĕ
vŏllaguṁṭe guṭṭudoḍa nuṁḍam̐gavalĕ
palladāna sanavulu pasāriṁcham̐bodenu
vullamulo veḍugalai yuṁḍam̐boyīnā

(||nīsitta||)
suṭṭariga mabchidenu sŏlasi sūḍam̐gavalĕ
vaṭṭi pŏṁdulaide talavaṁchugovalĕ
yaṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
maṭṭuleni nī radulu marasidem̐boyinā