Nee sittamu kolamdi ne nadasudimte kaaga

నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
Language

(॥పల్లవి॥)
నీ చిత్తము కొలఁది నే నడచుటింతే కాక
యేచి సిగ్గు విడువఁగ నిల్లాలికి సంగతా

(॥నీచి॥)
కొంకక నేనే నీకొంగు వట్టి తీసితేను
అంకెల నిదెంతగయ్యా ళనకుండేవా
మంకుల నెన్ని సేసినా మగవాని కమరును
జంకించి యాటదానికి చలివాయఁ జెల్లునా

(॥నీచి॥)
వొద్దనుండి నిన్నుఁజూచి వూరకే నే నవ్వితేను
అద్దో యిదెంతగబ్బి యనకుండేవా
కొద్ది మీరి యెట్టుండినాఁ గోడెకాఁడ నీ కమరు
చద్ది బింకము రాణివాసములకుఁ దగునా

(॥నీచి॥)
ముంచి నేనే నీకాఁగిలి మోరఁగకడిగితేను
అంచెల నిదెంతదిట్ట యనకుండేవా
కొంచక శ్రీవేంకటేశ కూడితి వింతలో నీవె
మించిన పట్టపుదేవి మేర మీరఁ జెల్లునా

(||pallavi||)
nī sittamu kŏlam̐di ne naḍasuḍiṁte kāga
yesi siggu viḍuvam̐ga nillāligi saṁgadā

(||nīsi||)
kŏṁkaga nene nīgŏṁgu vaṭṭi tīsidenu
aṁkĕla nidĕṁtagayyā ḽanaguṁḍevā
maṁkula nĕnni sesinā magavāni kamarunu
jaṁkiṁchi yāḍadānigi salivāyam̐ jĕllunā

(||nīsi||)
vŏddanuṁḍi ninnum̐jūsi vūrage ne navvidenu
addo yidĕṁtagabbi yanaguṁḍevā
kŏddi mīri yĕṭṭuṁḍinām̐ goḍĕgām̐ḍa nī kamaru
saddi biṁkamu rāṇivāsamulagum̐ dagunā

(||nīsi||)
muṁchi nene nīgām̐gili moram̐gagaḍigidenu
aṁchĕla nidĕṁtadiṭṭa yanaguṁḍevā
kŏṁchaga śhrīveṁkaḍeśha kūḍidi viṁtalo nīvĕ
miṁchina paṭṭabudevi mera mīram̐ jĕllunā