నీ చిత్తమిఁకను నేరములెంచకు నన్ను
(॥పల్లవి॥)
నీ చిత్తమిఁకను నేరములెంచకు నన్ను
యేచి నీ ముందర యిఁకనేమి సేతురా
(॥నీచిత్త॥)
సిగ్గులు వడఁగఁ బోతే సెలవినవ్వులు వచ్చీ
వెగ్గళము నవ్వితేను వేడుక వుట్టీ
అగ్గలవు వేడుకకు ఆయములు గరఁగీని
యెగ్గెరఁగదు జవ్వన మేమిసేతురా
(॥నీచిత్త॥)
మాటలణఁచుకొంటేను మనసెల్లాఁ జిమ్మిరేఁగీ
పాటించి మనసొగ్గితే పట్టీఁ దమి
నీటునఁ దమి పెంచితే నెలకొనీ విరహము
యీటుమీరీ జవ్వనము యేమి సేతురా
(॥నీచిత్త॥)
పాదా లొత్తుకుండితేను పారీఁ గాఁగిటికిఁ జేయి
పోదిఁ జేతులు చాఁచితే భోగ మబ్బీని
యీదెసశ్రీ వేంకటేశ యిట్టెనన్నుఁ గూడితివి
యేదెసా మించీ జవ్వన మేమిసేతురా
(||pallavi||)
nī sittamim̐kanu neramulĕṁchagu nannu
yesi nī muṁdara yim̐kanemi sedurā
(||nīsitta||)
siggulu vaḍam̐gam̐ bode sĕlavinavvulu vachchī
vĕggaḽamu navvidenu veḍuga vuṭṭī
aggalavu veḍugagu āyamulu garam̐gīni
yĕggĕram̐gadu javvana memisedurā
(||nīsitta||)
māḍalaṇam̐sugŏṁṭenu manasĕllām̐ jimmirem̐gī
pāḍiṁchi manasŏggide paṭṭīm̐ dami
nīḍunam̐ dami pĕṁchide nĕlagŏnī virahamu
yīḍumīrī javvanamu yemi sedurā
(||nīsitta||)
pādā lŏttuguṁḍidenu pārīm̐ gām̐giḍigim̐ jeyi
podim̐ jedulu sām̐side bhoga mabbīni
yīdĕsaśhrī veṁkaḍeśha yiṭṭĕnannum̐ gūḍidivi
yedĕsā miṁchī javvana memisedurā