నీ చిత్తమే యెరుఁగు నెలఁతల లాగులెల్ల
(॥పల్లవి॥)
నీ చిత్తమే యెరుఁగు నెలఁతల లాగులెల్ల
యేచి నీ మేన గురుతు లింత నించఁగలరా
(॥మచ్చి॥)
చిగురుమోవితోడిచెలి మాటలాడితేను
వొనరై వుండక వేరే వుప్పనుండునా
యెగసక్కేలంటానేల యెగ్గుపట్టేవు
సగమందుఁ బంచదార చల్లుకోరాదా
(॥మచ్చి॥)
వసమై కెందామరవంటికనుచూపులు
దెసల నెఱ్ఱనుండక తెల్లనుండినా
యెసఁగి కోపమంటాను యేల దూరేవు
పొసఁగఁ గప్రము గొంత పొదుపుకోరాదా
(॥మచ్చి॥)
సరుస కొండలనంటినచన్నులకాఁగిలి నీకు
ధర గట్లుగాక మెత్తన లయ్యీనా
యిరవై శ్రీవేంకటేశ యేలితివింతలోనె
వురమున బూదండలొత్తుకోరాదా
(||pallavi||)
nī sittame yĕrum̐gu nĕlam̐tala lāgulĕlla
yesi nī mena gurudu liṁta niṁcham̐galarā
(||machchi||)
sigurumovidoḍisĕli māḍalāḍidenu
vŏnarai vuṁḍaga vere vuppanuṁḍunā
yĕgasakkelaṁṭānela yĕggubaṭṭevu
sagamaṁdum̐ baṁchadāra sallugorādā
(||machchi||)
vasamai kĕṁdāmaravaṁṭiganusūbulu
dĕsala nĕṭranuṁḍaga tĕllanuṁḍinā
yĕsam̐gi kobamaṁṭānu yela dūrevu
pŏsam̐gam̐ gapramu gŏṁta pŏdubugorādā
(||machchi||)
sarusa kŏṁḍalanaṁṭinasannulagām̐gili nīgu
dhara gaṭlugāga mĕttana layyīnā
yiravai śhrīveṁkaḍeśha yelidiviṁtalonĕ
vuramuna būdaṁḍalŏttugorādā