Nee sittame yeṟumgu ne nemtadaana

నీ చిత్తమే యెఱుఁగు నే నెంతదాన
Language

(॥పల్లవి॥)
నీ చిత్తమే యెఱుఁగు నే నెంతదాన
కాచి నన్ను నేలి యిట్టె కనుఁగొనవయ్యా

(॥నీచి॥)
మచ్చిక నీతోడిది మాఁటలు చెలితోడివి
కొచ్చినచెమటలు చెక్కులమీఁదివి
కచ్చుపెట్టి కోరికలు కాఁగిటికి లాచినవి
యిచ్చట నావిన్నపము లేమిచెప్పేనయ్యా

(॥నీచి॥)
తలఁపు నీమీఁదిది తనువు పానుపుపైది
లలి నిట్టూర్పులు గుబ్బల నొరసేవి
యెలమి చూపులు నీకు యెదురులు చూచేవి
బలమి నాయాస లెంతపచారించేనయ్యా

(॥నీచి॥)
నవ్వులు సెలవులవి నాకూటమి నీరతిది
చివ్వన నాకాఁపురము సిగ్గుమీఁదిది
యివ్వల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నివ్వటిల్లఁ గూడితివి నిన్నేమనేనయ్యా

(||pallavi||)
nī sittame yĕṟum̐gu ne nĕṁtadāna
kāsi nannu neli yiṭṭĕ kanum̐gŏnavayyā

(||nīsi||)
machchiga nīdoḍidi mām̐ṭalu sĕlidoḍivi
kŏchchinasĕmaḍalu sĕkkulamīm̐divi
kachchubĕṭṭi korigalu kām̐giḍigi lāsinavi
yichchaḍa nāvinnabamu lemisĕppenayyā

(||nīsi||)
talam̐pu nīmīm̐didi tanuvu pānububaidi
lali niṭṭūrbulu gubbala nŏrasevi
yĕlami sūbulu nīgu yĕdurulu sūsevi
balami nāyāsa lĕṁtabasāriṁchenayyā

(||nīsi||)
navvulu sĕlavulavi nāgūḍami nīradidi
sivvana nāgām̐puramu siggumīm̐didi
yivvala śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
nivvaḍillam̐ gūḍidivi ninnemanenayyā