నీ చిత్త మెట్టున్నదో నేమేమి నెఱుఁగము
(॥పల్లవి॥)
నీ చిత్త మెట్టున్నదో నేమేమి నెఱుఁగము
చూచి మా మనసులైతే చొక్కి కరఁగీని
(॥॥)
సిగ్గరితనాన నిట్టే చెలి తల వంచీఁ గాని
అగ్గమై నీ మోము చూచే ఆస గనము
యెగ్గు పట్టుదువో యంటా నీతల నున్నది గాని
దగ్గరి కౌఁగిలించే తమకమే గనము
(॥॥)
గోలతనమున నీకె గుట్టున నున్నది గాని
తాలిమి నీతో మాటాడే తమి గనము
గేలిసేతువో యంటా కేలు చాఁచడు గాని
చాలా గుబ్బల నిన్నొత్తే చలములే గనము
(॥॥)
చిన్నతనమునఁ జేఁత సేయక లొంగీఁగాని
వున్నతిని రతి రేఁచే వుబ్బు గనము
యిన్నిటా శ్రీ వేంటేశ యిట్టే యింతిఁగూడితివి
నిన్ను మెప్పించే ననే నేర్పులింకా గనము
(||pallavi||)
nī sitta mĕṭṭunnado nememi nĕṟum̐gamu
sūsi mā manasulaide sŏkki karam̐gīni
(||||)
siggaridanāna niṭṭe sĕli tala vaṁchīm̐ gāni
aggamai nī momu sūse āsa ganamu
yĕggu paṭṭuduvo yaṁṭā nīdala nunnadi gāni
daggari kaum̐giliṁche tamagame ganamu
(||||)
goladanamuna nīgĕ guṭṭuna nunnadi gāni
tālimi nīdo māḍāḍe tami ganamu
geliseduvo yaṁṭā kelu sām̐saḍu gāni
sālā gubbala ninnŏtte salamule ganamu
(||||)
sinnadanamunam̐ jem̐ta seyaga lŏṁgīm̐gāni
vunnadini radi rem̐se vubbu ganamu
yinniḍā śhrī veṁṭeśha yiṭṭe yiṁtim̐gūḍidivi
ninnu mĕppiṁche nane nerbuliṁkā ganamu