Nee sitta mettunnado ne neṟumganu

నీ చిత్త మెట్టున్నదో నే నెఱుఁగను
Language

(॥పల్లవి॥)
నీ చిత్త మెట్టున్నదో నే నెఱుఁగను
చే చేత నా వలపులే చిమ్మి రేఁచీని

(॥॥)
చేరి నీకు విన్నపాలు చేసుకొనే నంటేను
సారెకు నివ్వెఱఁగులు సందడించీని
కూరిమి గొసరి నీ కొంగు వట్టే నంటేను
తారుమారై నా సిగ్గులే తడఁబరచీని

(॥॥)
కొంకక నిన్నే తలఁచి గుట్టున నుండే నంటే
పొంకపు చిఱునవ్వులు పొదిగొనీని
అంకె నీసుద్దులు విని అట్టే పొద్దు వుచ్చేనంటే
మంకుల పరవశాలు మరపించీని

(॥॥)
కన్నులనే నిన్నుఁ జూచి కడు బత్తి చూపే నంటే
కన్నెపాయపు గుణము కప్పీ నన్ను
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితి వింతలో నన్ను
సన్నల నీ మోవితీపు చవి పుట్టించీని

(||pallavi||)
nī sitta mĕṭṭunnado ne nĕṟum̐ganu
se seda nā valabule simmi rem̐sīni

(||||)
seri nīgu vinnabālu sesugŏne naṁṭenu
sārĕgu nivvĕṟam̐gulu saṁdaḍiṁchīni
kūrimi gŏsari nī kŏṁgu vaṭṭe naṁṭenu
tārumārai nā siggule taḍam̐barasīni

(||||)
kŏṁkaga ninne talam̐si guṭṭuna nuṁḍe naṁṭe
pŏṁkabu siṟunavvulu pŏdigŏnīni
aṁkĕ nīsuddulu vini aṭṭe pŏddu vuchchenaṁṭe
maṁkula paravaśhālu marabiṁchīni

(||||)
kannulane ninnum̐ jūsi kaḍu batti sūbe naṁṭe
kannĕbāyabu guṇamu kappī nannu
yinniḍā śhrīveṁkaḍeśha yelidi viṁtalo nannu
sannala nī movidību savi puṭṭiṁchīni