Nee sitta mettunnado ne neramganu

నీ చిత్త మెట్టున్నదో నే నెరఁగను
Language

(॥పల్లవి॥)
నీ చిత్త మెట్టున్నదో నే నెరఁగను
నీ చనవు గలుగఁగా నెమ్మది నుందానను

(॥నీచి॥)
నమ్మిక మాటాలాడి నన్ను నీవు లాలించఁగా
యెమ్మెలెల్లాఁ జెప్పుకొంటి నిందరితోను
పమ్మినీవు నాదిక్కు పలుమారుఁ జూడఁగాను
వుమ్మడి నాసాసల నుందాన నిపుడు

(॥నీచి॥)
నయగారితనమున నాతో నీవు నవ్వఁగాను
ప్రియముతోఁ గడు సింగారించుకొంటిని
దయతోడ నీవు నన్నుఁ దమకము రేఁచఁగాను
నియతాన నూడిగాలు నీకు నేఁ జేసితిని

(॥నీచి॥)
మందెమేళముగ నన్ను మన్నించి కూడఁగాను
కందువరతుల నిన్నుఁ గాఁగిలించితి
విందువలె నిన్నిటా శ్రీ వేంకటేశ న న్నేలఁగా
పొందులు సేసి నిన్నెప్పుడుఁ దలపోతును

(||pallavi||)
nī sitta mĕṭṭunnado ne nĕram̐ganu
nī sanavu galugam̐gā nĕmmadi nuṁdānanu

(||nīsi||)
nammiga māḍālāḍi nannu nīvu lāliṁcham̐gā
yĕmmĕlĕllām̐ jĕppugŏṁṭi niṁdaridonu
pamminīvu nādikku palumārum̐ jūḍam̐gānu
vummaḍi nāsāsala nuṁdāna nibuḍu

(||nīsi||)
nayagāridanamuna nādo nīvu navvam̐gānu
priyamudom̐ gaḍu siṁgāriṁchugŏṁṭini
dayadoḍa nīvu nannum̐ damagamu rem̐sam̐gānu
niyadāna nūḍigālu nīgu nem̐ jesidini

(||nīsi||)
maṁdĕmeḽamuga nannu manniṁchi kūḍam̐gānu
kaṁduvaradula ninnum̐ gām̐giliṁchidi
viṁduvalĕ ninniḍā śhrī veṁkaḍeśha na nnelam̐gā
pŏṁdulu sesi ninnĕppuḍum̐ dalabodunu