నీ చిత్త మెట్టున్నదో నే నెరఁగను
(॥పల్లవి॥)
నీ చిత్త మెట్టున్నదో నే నెరఁగను
చూచి నాకైతేఁ గడుసోద్యము లయ్యీని
(॥నీచి॥)
చనవు గల దంటాను సరసము నీతో నాడీ
వనిత కొలువులో నీవద్దఁ గూచుండి
యెనసి నీదొరతన మెంచవద్దా యిందుకుఁగా
విని సవతులెల్లా నివ్వెరగుతో నున్నారు
(॥నీచి॥)
అత్తి పెండ్లాడితినంటా నట్టె ముందే కడియెత్తీ
పొత్తులవా రుండఁగాను పొలిఁతి
తత్తరిచీఁ దన నీయంతరము భావించవద్దా
చిత్తగించి నీదేవుళ్లు సిగ్గులు వడేరు
(॥నీచి॥)
అలమేలుమంగ నేఁడట్టే నీవుర మెక్కీని
చెలులెల్లా వూడిగాలు సేయఁగాను
నిలిచి శ్రీవేంకటేశ నీగుట్టు దలఁచవద్దా
అల నీచుట్టపుఁగాంత లందర నవ్వేరు
(||pallavi||)
nī sitta mĕṭṭunnado ne nĕram̐ganu
sūsi nāgaidem̐ gaḍusodyamu layyīni
(||nīsi||)
sanavu gala daṁṭānu sarasamu nīdo nāḍī
vanida kŏluvulo nīvaddam̐ gūsuṁḍi
yĕnasi nīdŏradana mĕṁchavaddā yiṁdugum̐gā
vini savadulĕllā nivvĕragudo nunnāru
(||nīsi||)
atti pĕṁḍlāḍidinaṁṭā naṭṭĕ muṁde kaḍiyĕttī
pŏttulavā ruṁḍam̐gānu pŏlim̐ti
tattarisīm̐ dana nīyaṁtaramu bhāviṁchavaddā
sittagiṁchi nīdevuḽlu siggulu vaḍeru
(||nīsi||)
alamelumaṁga nem̐ḍaṭṭe nīvura mĕkkīni
sĕlulĕllā vūḍigālu seyam̐gānu
nilisi śhrīveṁkaḍeśha nīguṭṭu dalam̐savaddā
ala nīsuṭṭabum̐gāṁta laṁdara navveru