Nee sitta mettumduno ninnu ne nadugaraadu

నీ చిత్త మెట్టుండునో నిన్ను నే నడుగరాదు
Language

(॥పల్లవి॥)
నీ చిత్త మెట్టుండునో నిన్ను నే నడుగరాదు
చూచి చూచి వోర్వరాదు సుద్దు చెప్పవయా

(॥నీచి॥)
ఆరగించితివో లేదో ఆపెఁ జూచే వేడుకలు
వూరకె మఱచి యట్టే వుంటివో నీవు
నేరుపుల జాగరాల నిద్ర వచ్చెనో రాదో
కోరి యీ విచారాననే గుబ్బతిలి వుంటిని

(॥నీచి॥)
జలకమాడితో లేదో సతిఁ గూడే పరాకున
చెలప చెమటలనే చిప్పిలితివో
యెలమిఁ దెల్లవారిన దెరుక పడెనో లేదో
తలపోసి నీకుఁగానే తత్తరించి వుంటిని

(॥నీచి॥)
సింగారించుకొంటో లేదో చెనకేటితమకాన
వుంగిటితో మోవికి నోరూరుచుంటివో
అంగవించి శ్రీ వేంకటాధిప నన్నేలితివి
చెంగలించి నీగుణమే చెప్పుకొంటానుంటిని

(||pallavi||)
nī sitta mĕṭṭuṁḍuno ninnu ne naḍugarādu
sūsi sūsi vorvarādu suddu sĕppavayā

(||nīsi||)
āragiṁchidivo ledo ābĕm̐ jūse veḍugalu
vūragĕ maṟasi yaṭṭe vuṁṭivo nīvu
nerubula jāgarāla nidra vachchĕno rādo
kori yī visārānane gubbadili vuṁṭini

(||nīsi||)
jalagamāḍido ledo sadim̐ gūḍe parāguna
sĕlaba sĕmaḍalane sippilidivo
yĕlamim̐ dĕllavārina dĕruga paḍĕno ledo
talabosi nīgum̐gāne tattariṁchi vuṁṭini

(||nīsi||)
siṁgāriṁchugŏṁṭo ledo sĕnageḍidamagāna
vuṁgiḍido movigi norūrusuṁṭivo
aṁgaviṁchi śhrī veṁkaḍādhiba nannelidivi
sĕṁgaliṁchi nīguṇame sĕppugŏṁṭānuṁṭini