Nee sitta mettumduno neneṟamga naayagumda

నీ చిత్త మెట్టుండునో నేనెఱఁగ నాయకుఁడ
Language

(॥పల్లవి॥)
నీ చిత్త మెట్టుండునో నేనెఱఁగ నాయకుఁడ
యేచి నా సింగారమే యింతసేసె నన్నును

(॥నీచి॥)
గొప్పకన్నులనే రంటా కోరి తలవంతుఁగాని
తప్పక చూచె యందుకుఁ దమకింతును
కొప్పు జారీనంటాను గుట్టుతో నుండుదుఁగాని
ముప్పిరిఁ జేతులెత్తి మొక్క నుంకింతను

(॥నీచి॥)
అలరి చన్నులు పొడవైవున్నదంటాఁగాని
కొలువుసేసే యందుకుఁ గోరుకుందును
చిలుకుమోవితేనెలు చిందునోయంటాఁగాని
పలుమారు మాటలాడ బాఁతి పడివుందును

(॥నీచి॥)
సొరిదిఁ గొనగోళ్లు సోఁకునోయంటాఁగాని
వొరసి సరసమాడ నూహింతును
ఇరవై శ్రీవేంకటేశ ఇంతలో నన్నేలితివి
మరిగితి వంటా నొక్క మనసుతో నుందును

(||pallavi||)
nī sitta mĕṭṭuṁḍuno nenĕṟam̐ga nāyagum̐ḍa
yesi nā siṁgārame yiṁtasesĕ nannunu

(||nīsi||)
gŏppagannulane raṁṭā kori talavaṁtum̐gāni
tappaga sūsĕ yaṁdugum̐ damagiṁtunu
kŏppu jārīnaṁṭānu guṭṭudo nuṁḍudum̐gāni
muppirim̐ jedulĕtti mŏkka nuṁkiṁtanu

(||nīsi||)
alari sannulu pŏḍavaivunnadaṁṭām̐gāni
kŏluvusese yaṁdugum̐ goruguṁdunu
silugumovidenĕlu siṁdunoyaṁṭām̐gāni
palumāru māḍalāḍa bām̐ti paḍivuṁdunu

(||nīsi||)
sŏridim̐ gŏnagoḽlu som̐kunoyaṁṭām̐gāni
vŏrasi sarasamāḍa nūhiṁtunu
iravai śhrīveṁkaḍeśha iṁtalo nannelidivi
marigidi vaṁṭā nŏkka manasudo nuṁdunu