Nee sitta mettumdinaa nee kumdem gaani

నీ చిత్త మెట్టుండినా నీ కుండెఁ గాని
Language

(॥పల్లవి॥)
నీ చిత్త మెట్టుండినా నీ కుండెఁ గాని
చేచేత మావంటివారు చెనకక మానరూ

(॥॥)
మొకమోట గల సతి మొక్కనే నేరుచుఁ గాని
వెకలియై యెంతైనా వెంగె మాడదు
అకటా నావంటి మంకులైన చెలు లైతే నిన్ను
పక పక నవ్వి నిన్నుఁ బచ్చిసేయ కుండరు

(॥॥)
పొంది పొరసిన యింతి పొదుగ నేరుచుఁ గాని
సందడించి నా దడిచి సాదించదు
మందలించి నావంటి మంకులైన వారైతే
నింద వేసి తమ నేర్పు నెరపనే చూతురు

(॥॥)
గుట్టు దెలిసిన వారు గుణాన నుందురు గాని
వట్టి నిష్టూరము లాడి వలఁబెట్టరు
యిట్టే శ్రీ వేంకటేశ యెనసి నావంటివారు
నెల్లన నీ రతిఁ గూడి నిన్ను బైపై మెత్తురు.

(||pallavi||)
nī sitta mĕṭṭuṁḍinā nī kuṁḍĕm̐ gāni
seseda māvaṁṭivāru sĕnagaka mānarū

(||||)
mŏgamoḍa gala sadi mŏkkane nerusum̐ gāni
vĕgaliyai yĕṁtainā vĕṁgĕ māḍadu
agaḍā nāvaṁṭi maṁkulaina sĕlu laide ninnu
paga paga navvi ninnum̐ bachchiseya kuṁḍaru

(||||)
pŏṁdi pŏrasina yiṁti pŏduga nerusum̐ gāni
saṁdaḍiṁchi nā daḍisi sādiṁchadu
maṁdaliṁchi nāvaṁṭi maṁkulaina vāraide
niṁda vesi tama nerbu nĕrabane sūduru

(||||)
guṭṭu dĕlisina vāru guṇāna nuṁduru gāni
vaṭṭi niṣhṭūramu lāḍi valam̐bĕṭṭaru
yiṭṭe śhrī veṁkaḍeśha yĕnasi nāvaṁṭivāru
nĕllana nī radim̐ gūḍi ninnu baibai mĕtturu.