Nee seyye meem daaya neegum jelluraa | ninnu |

నీ చెయ్యే మీఁ దాయ నీకుఁ జెల్లురా । నిన్ను ।
Language

(॥పల్లవి॥)
నీ చెయ్యే మీఁ దాయ నీకుఁ జెల్లురా । నిన్ను ।
యేచి వలపుల బయ లీఁదించ నైతిరా

(॥నీ చెయ్యే॥)
మంచివానివలెనె మాట లాడఁ బిలిపించి
కంచముపొత్తుకుఁ దీసి కాకు సేసేవు
వంచనతో దవ్వులనె వట్టిగట్టు చేసి నిన్ను
పెంచి నీచేఁ బ్రియము చెప్పించ నేర నైతిరా

(॥నీ చెయ్యే॥)
బత్తి గలవానివలె పానుపుమీఁదికిఁ దీసి
హత్తి సిగ్గువడ నంటా నట్టె నవ్వేవు
కొత్త సతులవలెనె గొందులనుండి నిన్ను
తత్తరాన నాడ కెడతాఁకించ నైతిరా

(॥నేచయ్యే॥)
యిచ్చకునివలెనె యెలయించి నన్నుఁ గూడి
అచ్చల నా సుద్దులెల్ల నాడుకొనేవు
మెచ్చుగా శ్రీవెంకటేశ మేర మీరి ఆవేళనె
కచ్చు పెట్టి నీ మోవి గంటి సేయ నైతిరా

(||pallavi||)
nī sĕyye mīm̐ dāya nīgum̐ jĕllurā | ninnu |
yesi valabula baya līm̐diṁcha naidirā

(||nī sĕyye||)
maṁchivānivalĕnĕ māḍa lāḍam̐ bilibiṁchi
kaṁchamubŏttugum̐ dīsi kāgu sesevu
vaṁchanado davvulanĕ vaṭṭigaṭṭu sesi ninnu
pĕṁchi nīsem̐ briyamu sĕppiṁcha nera naidirā

(||nī sĕyye||)
batti galavānivalĕ pānubumīm̐digim̐ dīsi
hatti sigguvaḍa naṁṭā naṭṭĕ navvevu
kŏtta sadulavalĕnĕ gŏṁdulanuṁḍi ninnu
tattarāna nāḍa kĕḍadām̐kiṁcha naidirā

(||nesayye||)
yichchagunivalĕnĕ yĕlayiṁchi nannum̐ gūḍi
achchala nā suddulĕlla nāḍugŏnevu
mĕchchugā śhrīvĕṁkaḍeśha mera mīri āveḽanĕ
kachchu pĕṭṭi nī movi gaṁṭi seya naidirā